మీడియా చేతిలో ఉంటే.. అబద్దాలే ప్రచారాస్త్రాలు?

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డితో జగన్ మోహన్ రెడ్డిని కూడా కలుపుతూ వ్రాస్తున్నాయి ఎల్లో పత్రికలు. టికెట్ విషయంలో అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని హత్య చేశాడని, జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఇదంతా జరిపించాడని కూడా అని అంటున్నారు. ఇలా మీడియా అనేది తమకు తెలిసిన నిజాన్ని, తమ  ప్రొజెక్ట్ చెయ్యాలనుకుంటున్న   విషయాల్ని చెప్పడం అనేది శోచనీయాంశం.

ఇక్కడ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు తన బాబాయిని చంపించుకోడు కదా. అవినాష్ రెడ్డి చంపాడని అనుకుంటే వేరే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలా చేయడం వల్ల ఆయనకి ఏమి కలిసి వస్తుంది. పోనీ టిక్కెట్ విషయం అనుకుంటే ఆ టిక్కెట్ ని రానివ్వకుండా వివేకానంద రెడ్డి ఆపాడు అనడం అసమంజసం. ఎందుకంటే ముందు నుండి జగన్ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడట.

అలాంటప్పుడు ఈ టిక్కెట్ గురించి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపాడు అనేది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు జనం. మీడియా ద్వారా ఎదుటివారిని దొంగలుగానూ  చూపించవచ్చు, తమ వాళ్ళని దొరలుగా కూడా హైలెట్ చేయవచ్చు. మీడియా మనదైతే అంతా మన చేతిలోనే ఉంటుంది అన్నట్లు ఉంటుంది వీళ్ళ నైజం.

అసలు సిమెన్స్ సంస్థతో సంబంధం లేకపోయినా ఆ సంస్థతో మేము ఒప్పందం చేసుకున్నాం అంటూ 3300 కోట్లు రిలీజ్ చేస్తూ ఇంకో 370 కోట్లు పెట్టుకుంటే  మొత్తం కలిపితే 3700 కోట్లు అవుతుందని లెక్క కట్టారు. దానికి మళ్లీ కేంద్రం ఇచ్చిన దానితో కలుపుకొని ఒక నాలుగు వేల కోట్లు లెక్క వేసుకున్నారు. దాంతో 20 లక్షల మందికి ప్రయోజనం  చేకూరాలి. అలాగే భువనేశ్వరి దేవికి  మూలాఖత్ లు ఇవ్వలేదని అంటున్నారట. నిజానికి వారానికి మూడు మూలాఖత్ లు మాత్రమే ఉంటాయి. కానీ మూలాఖాత్ లు ఉన్నా కూడా ఇవ్వడం లేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: