బీజేపీ నేతలు.. టీడీపీ ట్రాప్‌లో పడిపోయారా?
బాబు విషయంలో ఖండించిన బీజేపీ నేతలు కవిత విషయానికొస్తే ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే ఆమెపై కేసు పెట్టారు. ఎలాంటి విచారణ లేకుండా.. స్కిల్ డెవలప్మెంట్ విషయానికొస్తే ఈ కేసులో ముందుగా పలువురిని విచారించి వారి వాంగ్మూలాన్ని సేకరించి ఆ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చారు. 37వ నిందితుడిగా చేర్చి కోర్టులో ప్రవేశపెట్టి ఇప్పుడు ఏ1 గా మార్చుతున్నారు. ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేశారు. బాబే కీలకం అతనికి తెలిసే ఇదంతా జరిగింది అని వారు వాదిస్తున్నారు.
లిక్కర్ కేసులో కవిత విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఈడీకి మాకు ఏంటి సంబంధం అని బీజేపీ నేతలు చెప్తుంటారు. ఏపీలో జగన్ అరెస్టు అయిన సందర్భంలో తనకు తాను నిరూపించుకోవాలి అని సెలవిచ్చారు. బాబు కూడా ఏ తప్పు చేయకుంటే దానిని నిరూపించి బయటకి రావాలి అని చెప్పవచ్చు కదా. ఇది అక్రమ కేసు అని ఎఫ్ఐఆర్ లేదు అని ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.
ఏపీ సీఎం జగన్ పై కూడా అప్పట్లో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ అతడిని అరెస్టు చేసినప్పుడు ఎవరూ స్పందించలేదు. పార్లమెంట్లో స్వయంగా మోదీ మాట్లాడారు. కావాలనే కక్ష పూరితంగా జగన్ పై కేసులు పెట్టారు అని. కానీ కేంద్ర నాయకులు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు బాబు విషయంలో మాట్లాడుతున్న వారు తెలిసి మాట్లాడుతున్నారా లేక ఏపీ మీడియా ట్రాప్‌లో పడి మాట్లాడుతున్నారా అనేది వారికే తెలియాలి.