పవన్‌ వ్యూహం.. చంద్రబాబు చాణక్యం..?

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశారంటూ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 300 కోట్ల వరకు నష్టం కలిగించారంటూ మరి కొంతమందితోపాటుగా చంద్రబాబు నాయుడుని సిబిఐ అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇది తెలుసుకున్న సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన విచారణ వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుని ఆ తర్వాత రాజమహేంద్రవరం జైలుకి తరలించారు.


అయితే పవన్ కళ్యాణ్  రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని పరామర్శించడం జరిగింది.  టిడిపి నేత చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.  పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని ధ్రువీకరించారు. అంతేకాకుండా 2024 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన  కూటమితో కలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఎదుట జరిగిన ఈ విలేకరుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, టిడిపి యువజన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు. వారితో పాటు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా ఈ ప్రసంగంలో ప్రధాన భూమిక పోషించారు. పదేళ్ల క్రితం 2014లో  టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడ్డాయని, 2024లో కూడా అదే విధంగా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ అన్నారు.


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే మహాకూటమి గా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జరిగిన ఈ ములాఖాత్ భవిష్యత్తు రాజకీయాలను శాసించే అంశం అవుతుందని పవన్ అన్నారు. చంద్రబాబు నాయుడు కే ఇలా జరిగితే ఇక సాధారణ జనాల పరిస్థితి ఏమిటి అని ఆలోచించాకే తాను రంగంలోకి దిగుతున్నానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇక జగన్ అన్యాయాలను భరించలేదని వారు అనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: