ఆ పది స్థానాలను టార్గెట్ చేసిన మోదీ, అమిత్‌షా?
2014 ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80 ఎంపీ స్థానాలకు 74 సీట్లు సాధించి బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2019లో కొంతమేర తగ్గినా 68 సీట్లు వచ్చాయి. గత 30, 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా యోగి సారథ్యంలో బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. గతంలో ఏనాడు డిపాజిట్ రాని త్రిపురలో రెండోసారి అధికారం తిరిగి చేజక్కించుకుంది. ఎప్పుడూ బీజేపీని ఆదరించని పశ్చిమ బెంగాల్లో ఈ సారి ఏకంగా ప్రతిపక్ష స్థానానికి చేరింది.
ఇలాంటి రికార్డు విజయాలు సాధించిన బీజేపీకి తమ సొంత రాష్ట్రం కర్ణాటకలో ఎదురుదెబ్బ తగలింది. తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ ముందుకు వస్తుంది. ఈ తరుణంలో అధ్యక్షుడిని మార్చి తన గోతిని తనే తవ్వుకున్నట్లు అయింది. ఏపీలో ఇప్పటి వరకు పొత్తులోఉన్న జనసేన టీడీపీతో కలిసి వస్తామని చెప్పడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయి.
ఏది ఏమైనా ఈ సారి లోక్ సభ ఎన్నికలకు పక్కా ప్రణాళికతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని 10 లోక్ సభ స్థానాలను ఎంపిక చేసుకొని అందులో పాగా వేసేలా వ్యూహాలు రచిస్తోంది. అవి రాయ్‌బరేలీ, అజాంఘర్, హసన్, నలందా, కజరంగా ఫార్మర్లీ కలీబార్, చినద్వారా, పురీ, తిరువనంతపురం, కోయంబత్తూర్, బెంగళూరు రూరల్ లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలకు సమాయత్తమవుతోంది.