బాబుకు మద్దతు ఇచ్చి.. రేవంత్ తప్పు చేశాడా?
ఈ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ చంద్రబాబు అరెస్టుతో తెలంగాణ కు ఏం సంబంధం.. ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలు చూసుకోవాలి అని తేల్చి చెప్పారు. చంద్రబాబు అరెస్టు దగ్గర నుంచి నిశబ్ధంగా ఉన్న టీపీసీసీ రేవంత్ రెడ్డి ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు.
హైదరాబాద్ పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధాని. ఈ విషయంలో రాజధానిలో నిరసన తెలుపవద్దని అంటే ఎలా. కేటీఆర్ వ్యాఖ్యలు అర్థ రహితం. చంద్రబాబు అరెస్టు ఏపీకి పరిమితమైన అంశం కాదు. దేశ రాజకీయాలకు సంబంధించినది. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో నిరసన చేస్తామంటే తప్పేముంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలోని వైట్ హౌస్ ల ఎదుట ధర్నాలు చేశాం. తెలంగాణాకు, అమెరికాకు ఏం సంబంధం. కేసీఆర్ దిల్లీకి వెళ్లి నిరసన చేయొచ్చు. చంద్రబాబు అరెస్టుపై ఆ రాష్ట్రం వాళ్లు ఇక్కడ నిరసన చేయకూడదా. అవసరమైతే వినతి పత్రం తీసుకొని అనుమతి ఇవ్వాలి. దేశంలో ప్రతి ఒక్కరికీ.. ఎక్కడైనా, ఎప్పుడైనా నిరసన తెలిపే హక్కుంది. దానిని వద్దు అనడం అర్థరహితం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కు సంబంధించిన కవిత విషయంలో ఆంధ్రాలో ఎవరూ ఉద్యమం చేయలేదు. కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్లు కూడా ఎవరూ నిరసన తెలుపలేదు. దిల్లీ రాజకీయ రాజధాని అక్కడ నిరసన చేయడంలో తప్పులేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో టీడీపీ నాయకులు చేస్తుంటే ఎవరూ అడ్డు చెప్పడం లేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చేస్తున్నారు చిక్కంతా అక్కడే వచ్చింది.