ఇక చంద్రబాబుకు కాంగ్రెస్ కూటమే దిక్కా?
అయితే ఇక్కడ కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు కాబట్టి అంతర్గతంగా కమ్యూనిస్టు పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీ కూడా ఐ ఎన్ డి ఐ ఏ కూటమి తో అనుబంధం కొనసాగిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించిన రఘువీర తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ లో బిజెపి చంద్రబాబునాయుడుని టార్గెట్ చేసిందని చెప్పడం జరిగింది. తెలుగు రాష్ట్రంలో బిజెపి జగన్మోహన్ రెడ్డిని వాడి టిడిపి స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తుందని ఆయన అన్నారు.
దాని కోసమే జగన్ భుజం మీద నుండి చంద్రబాబుకి కేంద్రం గురి పెట్టిందని ఆయన చెప్పడం జరిగింది. అసలు బిజెపికి టిడిపికి మధ్య గొడవ రావడానికి అసలు కారణం తెలుగుదేశం అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు టిడిపి, బిజెపి అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళింది.
అప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనేది విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత జగన్ వ్యూహం వల్ల బిజెపి నుండి టిడిపి విడిపోవడం జరిగింది. అప్పుడు బిజెపి ఇదంతా జగన్ వ్యూహం అని చెప్పినా కూడా టిడిపి పెడ చెవిని పెట్టి మరీ బయటకు వచ్చేసిందట. అయితే భవిష్య త్తు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా టిడిపి కాంగ్రెస్ పార్టీ వైపుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి అంటున్నారు వాళ్ళు.