జైల్లో బాబు.. బయట పట్టించుకునే దిక్కులేదా?
ఇంతవరకు బాగానే ఉంది. కానీ టీడీపీ చేస్తున్న నిరసన ప్రోగ్రాంలకు డబ్బులిచ్చి ప్రజలను తీసుకెళుతున్నారని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అయితే బాబు అరెస్టు అయిన మొదట్లో స్వచ్చందంగానే వచ్చిన చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు రావడం లేదని అంటున్నారు. ఏ ప్రోగ్రాం అటెండ్ కావాలన్న గ్రామాల్లో రూ. 200 పట్టణాల్లో అయితే ఒకరికి రూ.500 ఇవ్వాలని అడుగున్నారని తెలుస్తోంది. దీనితో పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తేనే వస్తామని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరి అంతటి సీనియర్ నాయకుడు ఆంధ్ర రాష్ట్రం కోసం విజన్ 2020 అని కలలు గన్న నేత అరెస్టు అయితే కనీసం స్వచ్ఛందంగా ప్రజలు రావడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ దీన్ని టీడీపీ అనుకూల మీడియా ఒప్పుకోవడం లేదు. ప్రజలు అందరూ స్వచ్ఛందంగా తరలివస్తున్నారని మోత మోగించి మరీ చెబుతున్నారు.
చంద్రబాబు కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. అక్కడ క్వాష్ పిటిషన్ ప్రకారం బాబుకు బెయిల్ ఇప్పించాలని అడుగుతున్నారు. అయితే అక్కడ కూడా చంద్రబాబుకు చుక్కెదురైంది. ముఖ్యంగా చంద్రబాబు విషయంలో వైసీపీ సర్కారు స్కిల్ డెవలప్ మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి భూముల కుంభకోణం ఇలా అనేక రకాల కేసులు వేస్తూ ఆయన్ని బయటకు రాకుండా చూస్తుంది. అయితే బాబు అరెస్టు విషయంలో ఇప్పటికే చాలా వరకు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా కూడా అది సక్సెస్ కాలేకపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరాశకు లోనవుతున్నారు.