జైల్లో బాబు: జగన్‌కు సెక్షన్‌ 17ఏ దెబ్బ?

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కావడం.. అసలు ఆయన అవినీతికి పాల్పడ్డారా.. లేక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇరికించారా.. అనేది సామాన్య మానవుడికి అర్థం కానీ ప్రశ్న. ఈ కేసు ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది.  అత్యున్నత న్యాయ స్థానం కూడా ఇదే ప్రశ్నలు వేసింది.  


స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో కుంభకోణం జరిగిందా.. జరిగింది. ఎలా చెబుతున్నారు.. ఆధారాలున్నాయి. ఇందులో ఈడీ కూడా విచారించింది.  260 బోగస్ కంపెనీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. మరి ఆ డబ్బులు చంద్రబాబు కే వచ్చాయి అనడానికి సాక్ష్యం ఏమిటి. అది తేల్చడానికే ఆయన్ను విచారించాలి. ఇది సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తీరు.


ఇదంతా ఒక ఎత్తు. ఈ తరహా అంతా తర్వాత విచారణలో జరగాలి. అసలు 17 ఏ ప్రకారం.. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు ని అరెస్టు చేశారు. 2018లో సెక్షన్ వచ్చింది. అప్పటికీ ఆయన సీఎం హోదాలో ఉన్నారు. కాబట్టి ఆయనకు ఈ చట్టం వర్తిస్తుంది. అందువల్ల క్వాష్ పిటిషన్ కు  అనుమతించాలి అని చంద్రబాబు తరఫు లాయర్లు వాదిస్తున్నారు. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ ఈ కేసు 2015లోనే ప్రారంభమైంది. అప్పట్లోనే జీఎస్టీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఏసీబీ విచారణకు ఆదేశించారు. 2018 జూన్ లో ఏసీబీ విచారణ ప్రారంభమైంది. జులైలో 17 ఏ చట్టం వచ్చింది కాబట్టి చంద్రబాబు కి ఈ చట్టం వర్తించదు అని.


ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే 17 ఏలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. కేవలం 17 ఏపైనే వాదనలు జరుగుతున్నాయి. మిగతా అంశాల జోలికి వెళ్లడం లేదు అని. వాస్తవానికి  17 ఏ నాన్ బెయిల్ బుల్ సెక్షన్. 17ఏ తీసేస్తే కేసు కొట్టేస్తారా వేయారా అన్నది తేలాల్సిఉంది. 17 ఏ ప్రకారం బెయిల్ ఇవ్వొచ్చు అని చెప్పి జరిగిన అవినీతిని కూడా పరిశీలించమని చెబుతారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: