ఆ వెబ్‌సైట్‌పై మోదీ సర్కారే కుట్ర చేయిస్తోందా?

మనం సోషల్ మీడియా యుగం, డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. మనం ఏది చేసినా క్షణాల్లో అందరికీ తెలిసే అవకాశం ఉంది. గతంలో మీడియా ఏది రాసినా జనం వాటిని గుడ్డిగా నమ్మే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే అది తప్పు అని సోషల్ మీడియాలో ఆధారాలతో సహా పోస్టులు పెడుతున్నారు. కాబట్టి మనం రాసే వార్తలపై నే కాదు చేసే పని పై కూడా పర్యవేక్షణ ఉంటుంది అనే విషయం గమనించాలి.


న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో దాని పాటు మానవ వనరుల విభాగాధిపతి అమిత్ చక్రవర్తిలను ఉపా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ సహా చైనాకు అనుకూల ప్రచారం చేస్తుందనే ఆరోపణలతో ఉపా కేసు నమోదు చేశారు. న్యూస్ క్లిక్ కు చైనా నుంచి నిధులు అందుతున్నాయని ఆగస్టు లో న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం రాసింది. చైనాకు సన్నిహితంగా ఉండే ఓ కంపెనీ నుంచి నిధులు పొందినట్లు అందులో వివరించింది.


అయితే ఈ అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ హై కోర్టును ఆశ్రయించారు.  దిగువ కోర్టులో అరెస్టుకు గల కారణాలు చెప్పకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మన కళ్ల ముందే కనిపిస్తుంది అని పేర్కొంది. దీనిపై స్పందన తెలియజేయాలని దిల్లీ పోలీసులను కోరారు. పుర్కాయుస్థా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఆయన అరెస్టు అక్రమం అని, దానికి గల కారణాలు చెప్పాలని కోరారు. అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది. ఆ తర్వాత ఆయన్ను రిమాండ్‌కు పంపింది.


న్యూస్ క్లిక్ కు అకస్మాత్తుగా రూ.30 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇదంతా మోదీ చేసినా కుట్రా.. మన దేశంలో జరుగుతున్న కుట్రలను సీరియస్ గా తీసుకోకుండా మానవ హక్కుల పేరిట దీనిని అడ్డుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: