వింత లాజిక్: చంద్రబాబు గెలిస్తే.. జగన్ గెలిచినట్టే..?
తాజాగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరుతున్నానో అనే విషయాలను ఇటీవల ఉండవల్లి వెల్లడించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తే జగన్ మంచిదని చెప్పుకొచ్చారు. ఈ కేసులో పైళ్లు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఫైళ్లు మాయం అయింది వైసీపీ హయాంలోనా.. టీడీపీ హయాంలోనా అనేది తేలాల్సి ఉందన్నారు. ఆస్తులు అమ్ముకొని ఎన్నికల్లో ఖర్చు చేసిన చరిత్ర ఎవరకీ లేదని.. దీనికి వైఎస్ ఆర్, చంద్రబాబు అతీతాలు కాదన్నారు.
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకి నేరుగా ముడుపులు అందాయని చెప్పడానికి ఆధారాలు లేవని చెప్పారు. కానీ ఆయన పీఏ ఖాతాలోకి వెళ్లాయన్నది నిజమని అన్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్షసాధింపు చర్యగానే అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ కేసులో 17 ఏ వర్తిస్తే జగన్ పై సైతం కేసులు ఉండవని తెలిపారు. ఈ కేసును ఎంత కూల్ గా తీసుకుంటే అంత మంచిదని స్పష్టం చేశారు.
క్యాబినెట్ నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించరాదనే కొత్త విషయాలను చెబుతున్నారని.. అదే నిజమైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు జగన్ ఎలా బాధ్యలవుతారని ప్రశ్నించారు. అలా అయితే జగన్ పై కేసులు పెట్టకూడదు అని చెప్పారు. మరోవైపు టీడీపీతో పొత్తు విషయంలో పవన్ తొందర పడ్డారని.. కొద్ది రోజుల పాటు ఆగాల్సి ఉండేదని సలహా ఇచ్చేవాడినని అభిప్రాయపడ్డారు. దీనిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఆయన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తున్నారు.