ఈ విషయం పురంధేశ్వరి ఆలోచించాల్సిందే?
బీజేపీ అధ్యక్షురాలిగా తనకు తాను ఆత్మపరిశీలన చేసుకోవాలని పురంధేశ్వరికి పలువురు రాజకీయ నేతలు సూచిస్తున్నారు. ఆమె పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అనే అంశంపై విశ్లేషణ జరపాలని కోరుతున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ అధిష్ఠానం స్పందించలేదు. కానీ పురంధేశ్వరి మాత్రం చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికంగా జరిగింది అని.. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే కోర్టే ఆ కేసును కొట్టివేసేది. కానీ ఇప్పుడు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.
చంద్రబాబును అరెస్టు చేసిన తొలి రెండు రోజుల్లో ఆ తరహా ఆరోపణలు చేశారంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు అవినీతి జరిగింది అని ఆధారాలు చూపుతున్నా ఆమె ఇంకా అప్రజాస్వామికం అని చెప్తూనే ఉన్నారు. మరోవైపు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ విషయంలో చర్చ అనవసరం అని తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు అని తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో వైసీపీ నేతలు కూడా బీజేపీ, టీడీపీ ఒకటే అని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ బలహీనపడే అవకాశం ఉంది.