కేసీఆర్‌ ఫ్యూచర్‌ డిసైడ్‌ చేసేది ఆ మూడు వర్గాలే?

ఏ అంశం ఎలా ఉన్నా అధికారాన్ని నిర్ణయించేది కొన్ని సామాజిక వర్గాలే.  డబ్బు ప్రధాన పాత్ర పోషించినా వాటితో పాటు సామాజిక వర్గాలు కూడా తోడైతేనే అధికారం సులభమవుతుంది. తెలంగాణ విషయానికొస్తే మన దగ్గర అధికారాన్ని నిర్ణయించేది ముస్లింలు, గిరిజనులు, సీమాంధ్ర ఓటర్లు.


తెలంగాణాలో ముస్లిం జనాభా 12శాతం మేర ఉంది. వీరు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్ , ఎంఐఎం మధ్య సాన్నిహిత్యం తో పాటు షాదీ ముబారక్, మైనార్టీ గురుకులాలు తదితర పథకాలు వారిని బీఆర్ఎస్ వైపు మళ్లేలా చేశాయి. తాజాగా వీరిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేసి లభ్ధి పొందాలని చూస్తోంది. కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కూడా తమనే ఆదరిస్తారని ఆపార్టీ భావిస్తోంది.


గిరిజనుల విషయానికొస్తే వారి జనాభా సుమారు 10శాతం. గత ఎన్నికల్లో వీరు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేసినట్లు అర్థమవుతుంది. ఎందుకుంటే వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ములుగు, ఇల్లందు, భద్రాచలం, అసిఫాబాద్ లాంటి సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది. ఎందుకంటే పోడు హక్కుల సమస్యలను పరిష్కరించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ పోడు పట్టాలను పంచి వారి ఆగ్రహాన్ని కొంతమేర తగ్గించింది. అయితే వీరు కేసీఆర్ పథకాలకు ఆకర్షితులవుతారా.. లేక కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారా అనేది చూడాలి.


మరో కీలకమైన ఓటర్లు ఏపీ సెటిలర్లు. వీరు 2014లో కాంగ్రెస్, టీడీపీ వైపు నిలబడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మళ్లారు. దీంతో పాటు టీడీపీ మెజార్టీ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు మారిపోయాయి. కేటీఆర్ చంద్రబాబు అరెస్టు తో తెలంగాణకు ఏం సంబంధం అని ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కమ్మ సామాజిక ఓటర్లతో పాటు టీడీపీ సానుభూతి పరులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ అనుకూల నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: