బ్రిటన్ను వణికిస్తున్న ముస్లిం టెర్రరిజం?
ఆయా దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ఏర్పాటు చేసిన తర్వాత కూడా వీళ్ల అరాచకాలు కొనసాగుతుంటాయి. అక్కడ షియాజీలు, అహ్మదీయులు, కుర్ధులు ఉండకూడదు అంటుంటారు. ఉదాహరణకు పాకిస్థాన్, అఫ్గాన్ దేశాలను చూసుకుంటే అక్కడ కేవలం ముస్లింలే ఉన్నా కూడా వారినే హింసిస్తుటారు. వారిపై ఆత్మాహుతి దాడులు జరుపుతుంటారు.
ఒక దేశంపై దాడి చేసి అక్కడున్న వారి మతం మార్చేసి ఆ తర్వాత కొన్నేళ్లు పోయిన తర్వాత వీళ్లు హరామ్ లు అని చంపేస్తుంటారు. ఇరాక్, ఇరాన్, అఫ్గాన్, పాక్ లో ప్రస్తుతం జరుగుతుంది అదే. వీళ్ల బారి నుంచి బయట పడేందుకు బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గాన్, సిరియా, పాలస్తీనా తదితర దేశాల నుంచి శరణార్థులు బ్రిటన్ కు వలస వెళ్లారు. బ్రిటన్ ముస్లిం దేశం కాకపోయినా.. పూర్తి క్రైస్తవ దేశం అయినా సరే శాంతి కోరుతున్నాం అనే భావనలో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వచ్చిన వారికి ఉపాధి చూపుతున్నారు. తద్వారా వారి జీవన విధానం మెరుగయ్యేందుకు కృషి చేస్తున్నారు.
ఇప్పుడు అక్కడున్న వారంతా బ్రిటన్ లో తమకు మత రాజ్యం కావాలని.. షరియా చట్టం అమలు చేయాలని..ఉద్యమాలు చేస్తున్నారు. ఏకంగా మత పరమైన బోధన అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ లోని రాజుగారి విగ్రహానికి పాలస్తీనా జెండాలు కట్టిన ఉదంతం అక్కడ కలకలం సృష్టించింది. ఈ శరణార్థుల ద్వారా తమ దేశానికి ప్రమాదం అని ఫ్రాన్స్, బ్రిటన్ లు భావించాయి. అందులో భాగంగా వీరందరినీ గుర్తించి తమ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు సిద్ధపడుతుంది.