తెలంగాణలో తాజా సర్వే: ఊహించని ఫలితాలు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయా పార్టీలు అసమ్మతిని ఎదుర్కొంటున్నాయి.  ఇప్పటికే టికెట్ రానీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. మరోవైపు  పార్టీల మధ్య మాటల యుద్ధం, ఎన్నికల హామీలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే  పలు సర్వే సంస్థలు ఫలానా రాజకీయ పార్టీనే గెలుస్తుందంటూ పొలిటకల్ హీట్ ను రాజేస్తున్నాయి.  ఓ సారి కాంగ్రెస్ వైపు, మరోసారి బీఆర్ఎస్ కు అనుకూలంగా సర్వే ఫలితాలను చెబుతూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.


అయితే కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పార్టీ అధిష్ఠానం నేరుగా పార్టీ నిర్ణయాలను పర్యవేక్షిస్తోంది. అభ్యర్థుల ఎంపిక మొదలు.. గ్యారెంటీ పథకాల ప్రకటన వరకు అన్నీ తానై వ్యవహరిస్తోంది.  ఇదే సమయంలో గులాబీ బాస్ కూడా హ్యాట్రిక్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా నేషనల్ సెఫాలజీ ఇన్స్ట్యూట్ సర్వే సంస్థ ప్రకారం తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని చెప్పింది.  


41.2శాతం  ఓట్లతో 74కి అయిదు స్థానాలు అటూ, ఇటూ మరొచ్చు అని తెలపింది. అంటే 79 లేదా 69 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొంది. మరోవైపు 14.3 శాతం ఓట్లతో బీజేపీ 6 స్థానాలు గెలుచకుంటుంది అని తెలిపింది. ఇతరులకు 9.1 శాతం ఓట్లు రావొచ్చని అంచనా వేసింది.


ఈసారి పక్కాగా అధికారంలోకి వస్తామని చెబుతూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ కు మరోసారి నిరాశే ఎదురవుతుందని తెలిపింది. ఆ పార్టీకి 32.5 శాతం ఓట్లు వచ్చి 26-32 సీట్లకు పరిమితమవుతుందని అంచానా వేసింది. ఎంఐఎం కు 2.5శాతం ఓట్లతో 7-8 సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే సెప్టెంబరు-అక్టోబరు మధ్య కాలంలో చేపట్టిన్నట్లు వివరించింది. ఈ సర్వే అభ్యర్థుల ప్రకటనకు ముందు చేసిందని..  తాజాగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మరోసారి సర్వే నిర్వహించి తమ ఫైనల్ ఫలితాలను వెల్లడిస్తామని ఆ సర్వే సంస్థ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: