ఆ పథకం అటకెక్కించిన జగన్?
గతంలో ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ ప్రధానంగా ల్యాంకో అనే సంస్థకు అనుబంధంగా లైట్ అనే స్వచ్ఛంద సంస్థను నడిపించారు. ల్యాంకో కు ఆదాయపు పన్ను మినహాయింపు తో ఈ స్వచ్ఛంద సంస్థ ను నడిపిస్తూ నందిగామ, జగ్గయ్యపేట లాంటి చోట్ల ఎక్కువగా బోర్లు తవ్వించారు. దీంతో ఆయన రెండు సార్లు ఎంపీగా గెలుపొందగలిగారు. ఒకసారి బోరు తవ్వితే నీళ్లు రాని చోట్ల రైతులు, ఆయా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అలాంటి సందర్భంలో బోర్లు వేయించడం ద్వారా ఎక్కువ మందికి నీటి సౌకర్యం కల్పించడమే కాకుండా ఎక్కువ రోజులు ప్రజలకు గుర్తుండే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సార్లు మంచి పథకాలను అటకెక్కించడంలో ఆయా ప్రభుత్వాలు చేసినట్లే వైసీపీ అధినేత సీఎం జగన్ చేస్తున్నారు. కానీ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఉచితంగా బోర్లు వేయిస్తామని చెప్పినా సీఎం జగన్ ఆ తర్వాత మాట తప్పడం చాలా బాధాకరమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన అవసరమున్న పథకాలను గుర్తుంచుకుని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలాంటి కార్యక్రమాన్ని అటకెక్కించడం సర్కారుకే చెడ్డపేరు తెస్తుంది.