చంద్రబాబు ఔట్.. బరిలో పవన్ కల్యాణ్?
అయితే తెలంగాణలో పవన్ కల్యాణ్ కు అంతగా మద్దతు లేకున్నా బీజేపీ ఎందుకు పొత్తుకు వెంపర్లాడుతుందని అందరూ చర్చించుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేంద్రం ప్రధాన రాజకీయాలు చేసే పార్టీల్లో టీడీపీ, వైసీపీ పక్కకు తప్పుకోగా కేవలం జనసేన మాత్రమే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనుందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే రాజకీయాల్లో వివిధ రకాల సమస్యలు వస్తుంటాయి.
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ముఖ్యంగా గెలుపొటములు సహజం. కానీ ఆయా పార్టీ అభ్యర్థులు మాత్రం పోటీ చేయాలి. ఓటు బ్యాంకును రక్షించుకోగలగాలి. సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. గెలుస్తాయని కాదు ఆ ప్రాంతాల్లో ఉన్న ఓటు బ్యాంకును కనీసం కాపాడుకునేందుకు అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడుతుంది. ఇలా పోటీ లో నిల్చొవడం వల్ల గుర్తింపు ఎప్పటికీ ఉంటుంది. మరి తెలంగాణలో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో చూడాలి.
ఇక వైఎస్సాఆర్ టీపీ పార్టీ పెట్టుకున్న వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుని ప్రస్తుత ఎన్నికల్లో నిలబడనుంది. కానీ తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న షర్మిళను ఎక్కువగా ఆంధ్రకు చెందిన మహిళగానే ఇక్కడి ప్రజలు చూస్తున్నారు. మొత్తం మీద.. తెలంగాణ గడ్డ నుంచి పోటీకి టీడీపీ తప్పుకుంది.. వైసీపీ ఎప్పుడో తప్పుకుంది.. వైటీపీ, జనసేన మాత్రమే తంటాలు పడుతున్నాయి.