బాబును చక్ర బంధంలో ఇరికిస్తున్న జగన్‌?

చంద్రబాబు పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇవి ఇప్పట్లో ఆగేలా లేదు. ఎవరు ఫిర్యాదు చేస్తున్నారో తెలియడం లేదు కానీ… ఒక దాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్, ఇసుక కుంభకోణం ఇలా వరుసగా ఈ సమయంలో ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు ఇలా ప్రతిపక్ష నేతను వేధిస్తున్నారన్న సానుభూతి ప్రజల్లోకి వెళ్తే వైసీపీ పరిస్థితి ఏంటి అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


చంద్రబాబుని బయట తిరగనివ్వకుండా చేసేందుకు చేస్తున్న కుట్రగా టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వరుస కేసుల వెనుకు రెండు కోణాలు ఉన్నట్లు అర్థమవుతుంది. వైసీపీ సర్కారు కొలువు తీరిన తర్వాత తొలినాళ్లలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని నిర్ణయించి.. కేబినేట్ సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీ తీర్మానం మేరకు సీఐడీని విచారణకు ఆదేశించింది.


అయితే దానిపై టీడీపీ రివ్యూ పిటిషన్ వేసింది. వాటన్నింటిపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత దానిని కొట్టేసింది. దీనని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా అసలు విచారణ చేయొద్దంటే ఎలా.. విచారణ చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఒక్కొక్క కేసు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.


వాస్తవానికి ఐఏఎస్ అధికారులు  ఈ కేసుల్లో వాంగ్మూలం ఇవ్వాలి. లేకపోతే వాళ్లని కూడా నిందితులుగా పేర్కొనాలి. తాజాగా అజయ్ కల్లం లాంటి వాళ్లను కూడా విచారించాలి అని ఓ పిటిషన్ వేశారు. ఒక ఫైలుపై అధికారం సంతకం పెట్టిన తర్వాత దానిపై అవినీతి ఆరోపణలు వస్తే ఐదేళ్ల లోపు విచారణ అయితే దానిని అనుమతులు అవసరం లేదు. ఐదేళ్లు దాటితే వాళ్లపై కేసు పెట్టడానికి లేదు. కానీ వాళ్ల దగ్గర నుంచి మేజిస్ర్టేట్ సమక్షంలో వాంగ్మూలం తీసుకోవచ్చు. వరుస కేసుల వెనుక ఉన్న మెలికలు ఇవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: