రైతన్నను జగనన్న మోసం చేస్తున్నారా?

రాష్ట్రం అమలు చేసే ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి పేర్లు మార్చేసి తామే అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాయి. తాజాగా ఏపీలో ఓ పేపర్ లో వచ్చిన ప్రకటనను పరిశీలిస్తే.. చెప్పిన దాని కన్నా ముందుగా.. మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు సాయం. మ్యానిఫెస్టోలో చెప్పింది ఏటా.. రూ.12,500. నాలుగు సంవత్సరాలకు రూ.50వేలు. జగనన్న ప్రభుత్వం ఇస్తోంది ఏటా రూ.13,500. 5 సంవత్సరాలకు రూ.67,500. మ్యానిఫెస్టోలో చెప్పిన దాని కన్నా రైతన్నకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ.17,500  


అయితే ఇందులో ఒక మతలబు ఉంది. జగన్ చెప్పింది కేంద్రం ఇస్తున్న డబ్బులతో కాదు. అంతకు ముందు టీడీపీ కూడా ఏటా రూ.10 వేల సాయం ఇస్తామని చెప్పింది. అప్పటికే కేంద్రం రూ.6వేలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ రూ.6 వేలకు రూ.4 వేలు కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది.


ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంతో సంబంధం లేకుండా రూ.10 వేలు ఇస్తామని తమ మేనిఫెస్టోలో చేర్చింది. మేం రూ.12500 ఇస్తామని ముందుగానే ప్రకటించాం అని వైసీపీ ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టింది. వాళ్లు ఐదేళ్లు రూ.50వేలు ఇస్తే మేం నాలుగేళ్లకే ఆ మొత్తాన్ని జమ చేస్తాం అని ప్రకటించింది.


ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లకు ఇచ్చింది రూ.67,500. ఈ మొత్తం సొమ్ము రాష్ట్ర ప్రభుత్వానిది కాదు. కేంద్రం వాటా పీఎం కిసాన్ వి రూ. 30వేలు. రాష్ట్ర వాటా రూ.37,500. అంటే మిగతా రూ.30వేలు రాష్ట్రానికి కావు. అంటే మిగతా రూ.30 వేలు ఇవ్వడం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయం వైసీపీ మ్యానిఫెస్టో చూస్తే అర్థం అవుతుందంటున్నారు.. దీని గురించి ఒక్కసారి ఆలోచించు కోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: