రేవంత్.. అనవసరంగా పాడుచేసుకోవద్దు?
ఇదిలా ఉండగా కొన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించడానికి మరో వర్గాన్ని తిట్టడం కాంగ్రెస్ కు మొదటి నుంచి ఉన్న అలవాటే. అదే సంప్రదాయాన్ని ఇప్పుడూ కొనసాగిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయమని టీటీపీ ప్రకటించింది. దీంతో ఆ పార్టీ సానుభూతి పరులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని పొగుడుతూ వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు.
ఇప్పటి వరకు చంద్రబాబుకి అండగా ఉంటూ వస్తున్న మందకృష్ణ మాదిగా ఒక్కసారిగా బీజేపీ వైపు మళ్లారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మాదిగ ఓట్లకు విషయంలో గండి పడినట్లయింది. మరోవైపు టీడీపీ సానుభూతి పరులు ఇప్పటికే కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఓట్లన్నీ చీలకుండా తమకే గంపగుత్తుగా పడాలంటే బీఆర్ఎస్ నే కాదు వైసీపీ నేతలను కూడా లక్ష్యం చేసుకోవాలని కాంగ్రెస్ భావించినట్లుంది.
అందులో భాగంగా రాజశేఖర్ రెడ్డి కారణంగానే తెలంగాణలో పార్టీ దెబ్బతింది అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవాలు పరిశీలిస్తే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసిందే వైఎస్ఆర్. 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ కూటమి కట్టి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తున్న సమయంలోను వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ కు భారీగానే సీట్లు వచ్చాయి. కానీ టీడీపీ ఓట్ల కోసం వైఎస్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు.