ఆంధ్రాలో అప్పుల గోల.. ఏది నిజం?

రాష్ట్ర ప్రభుత్వ అప్పుల, రాజధాని ఏర్పాటు పై వైసీపీ, టీడీపీల మధ్య తీవ్ర వాదోపవాదనలు, విమర్శలు నిత్యం కొనసాగుతున్నాయి. అప్పులు మీ పాలనలో ఎక్కువ అంటే కాదు మీ పాలనలోనే ఎక్కువని.. రాజధాని ప్రకటన విషయంలో చంద్రబాబు లాబీ ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని వైసీపీ.. రాజధాని మార్పు విషయంలో మీ ప్రయోజనాలే ఉన్నాయని టీడీపీ పరస్పరం వాదులాడుకుంటున్నాయి.

 
వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం జీఎస్ డీపీ వృద్ధి రేటులో దేశంలో ఆంధ్రప్రదేశ్ 2018-19లో 22వ స్థానంలో ఉండగా..జగన్ ప్రభుత్వంలో 2021-22 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2018లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలో 17వ స్థానంలో ఉండగా.. జగన్ సర్కారు వచ్చిన తర్వాత 2022-23 నాటికి 9 వస్థానంలో నిలిచింది. 2014-19 మధ్య అప్పులు 169శాతం పెరిగితే జగన్ హయాంలో 2019-23లో 58శాతానికే పరిమితం చేశారు అని ప్రచారం చేసుకుంటున్నారు.  


ఇదిలా ఉండగా ఎల్లో మీడియాలో మాత్రం జగన్ ప్రభుత్వం లెక్కకు మించి అప్పులు చేస్తోందని.. వాటిని రహస్యంగా ఉంచుతోందని ఆరోపిస్తోంది. 2014 జూన్ 2 నాటికి రూ.1,18,544 కోట్లుగా ఉన్న ప్రజా రుణం.. 2019 మార్చి నాటికి రూ.2,57,509 కోట్లకు చేరింది. ఇప్పుడది ఏకంగా రూ.4,81,183కోట్లకు చేరింది. 2014 నాటికి కార్పొరేషన్ రుణాలు రూ.13,842 కోట్లు ఉండగా 2019 నాటికి రూ.35964 కోట్లక ఉచేరింది. ఇప్పుడవి రూ.3లక్షల కోట్లకు చేరిందని అంచనా..


ప్రతినెలా కాగ్ లెక్కలు అడుగుతున్నా.. వాటిని వైసీపీ ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. మరోవైపు నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ.వేల కోట్ల బిల్లులు తదుపరి బడ్జెట్ కు బదిలీ చేయలేదని ఆరోపించింది. పర్సంటేజీ పరంగా చూస్తే ప్రభుత్వ ఆదాయం పెరిగిందని.. అంతకు ముందు టీడీపీ హయాంలో ఎంత పెరిగిందనే లెక్కలు మాత్రం ఎల్లో మీడియా ప్రచురించలేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి కథనాలు ప్రచురితం చేస్తోందని ఆరోపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: