టీ కాంగ్రెస్‌లో సీఎంల గొడవ.. బలమా.. బలహీనతా?

బహుశా ఏ రాజకీయ పార్టీకి లేని ఓ  వింత సమస్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుంది.  సాధారణంగా ఏ పార్టీకి అయినా ముఖ్యమంత్రి పదవి కోసం ఒకరు లేదా ఇద్దరు మహా అయితే అయిదుగురు పోటీ పడతారు. ఇది సహజం. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఏకంగా ఓ డజను పేర్లు చెప్పవచ్చు.  కాదు కాదు అంతకు మించి పోటీ పడుతుంటారు .


అదే ప్రాంతీయ పార్టీ అయితే ఆ పార్టీ అధినేతలే సీఎం లు అవుతారు.  ఉదాహరణకు బీఆర్ఎస్ అయితే కేసీఆర్, వైసీపీ జగన్, టీడీపీ చంద్రబాబు, డీఎంకే స్టాలిన్ ఇలా. అదే జాతీయ పార్టీల విషయానికొస్తే ఎవరు సీఎం అవుతారో చెప్పడం కష్టం. అధిష్ఠానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో వారే సీఎంగా బాధ్యతలు చేపడతారు. ఉదా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్లారి కిరణ్ కుమర్ రెడ్డి సీఎం అవడం ఎవరూ ఊహించని పరిణామమే.


ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు మీ పార్టీలో దాదాపు 12మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని ప్రశ్నించగా దానికి ఆయన అది మా సమర్థత అని బదులిచ్చారు. వాస్తవానికి ఇది నిజమే అయినా అందరూ కలిసి కట్టుగా ఉంటారా అనేదే ప్రశ్న.  ఇంతమంది ఉమ్మడిగా ప్రచారం చేస్తే ఆపార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు వాదన.


మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదాపు 85మంది అభ్యర్థులు ఉంటే నయం. అందరూ వారి విజయానికి కృషి చేస్తారు. అంతిమంగా పార్టీకి లాభం చేకూరుతుంది అని. అయితే ప్రాంతీయ పార్టీలో మంత్రి పదవికి ఏ విధంగా అయితే పోటీ ఉంటుందో.. జాతీయ పార్టీకి సీఎంకి పోటీ అలానే ఉంటుంది. మరోవైపు రాజస్థాన్ , తెలంగాణలో కూడా బీజేపీకి నలుగురు సీఎం అభ్యర్థులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: