జగన్ గెలిస్తే ఖర్చు.. బాబు గెలిస్తే చౌక?
ధరల పెరుగుదల గురించి వార్తలు రాయడం తప్పు బట్టడానికి లేదు. బియ్యం, కందిప్పు రేట్లు అమాంతం పెరిగిపోయాయని కందిపప్పు ధర దాదాపు 150 పైనే పలుకుతుందని టీడీపీ హయాంలో రూ. 70 కే వచ్చిందని రాసుకొస్తున్నారు. ఉప్పు, పప్పు, కూరగాయల రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాటి ధరలు పెరిగిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా గత ప్రభుత్వాల హయాంలో ఉన్న రేట్లను కంపరిజన్ చేస్తూ వార్తలు రాయరు. కేవలం జగన్ సర్కారు నిత్యావసర ధరల్ని అదుపు చేయడంలో విఫలం అవుతున్నారని చెప్పడంలో సక్సెస్ అవుతున్నారు.
సాధారణంగా ఒక నిత్యావసర వస్తువు ధర భారీగా పెరిగినపుడు దాన్ని సూపర్ బజార్లలో, రైతు బజార్లతో పెట్టించి ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చేలా ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా ఉల్లి పాయలు, కందిపప్పు, టామాట విషయంలో ఇలా చేస్తుండే వారు. గతంలో చంద్రబాబు ఇలా చేశారు. ఇప్పుడు జగన్ చేస్తున్నారు.
అయితే మైండ్ గేమ్ నడపడంలో టీడీపీ ఎల్లో మీడియాను సంపూర్ణంగా వాడుకుంటుంది. ఎందుకంటే టీడీపీ హయాంలో పెరిగిన ధరలను చూపించకుండా కేవలం అప్పుడు తక్కువున్న రేట్లను చూపిస్తూ ఇప్పుడున్న రేట్లు విపరీతంగా పెరిగాయని చెబుతూ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారు. కానీ దీని విషయంలో మాత్రం ఎక్కడా కూడా ప్రజలు గుడ్డిగా నమ్మే కాలం పోయింది. ఆలోచించి ఎక్కడా లోపం ఉంది. ఏం జరుగుతుందనే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాతనే ఏ పార్టీని గెలిపించాలో వారికే ఓటు వేస్తున్నారు.