బీజేపీని బావ జనతా పార్టీగా మార్చేసిన పురందేశ్వరి?

గత కొద్దీ రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వర్సెస్ వైసీపీ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.  రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని.. కేంద్ర నిధులు పక్కదారి పడుతున్నాయని, నేరాలు ఘోరాలు పెరిగిపోయాయి అని పురంధేశ్వరి వరుసగా ఆరోపిస్తూ వస్తున్నారు. దీంతో పాటు పలు అంశాల్లో దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని సైతం కోరారు.


ఇదే క్రమంలో  పురంధేశ్వరి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ముఖ్యంగా విజయ సాయి రెడ్డి రోజూ స్పందిస్తున్నారు.  ఆమెకు దీటుగా సమాధానాలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. బావ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అంటూ పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి ఆమెను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. బీజేపీని పల్లెత్తి మాట కూడా అనడం లేదు.


నేరుగా కేంద్రాన్ని విమర్శించే సాహసం విజయసాయిరెడ్డి కానీ ఇతర వైసీపీ ఎంపీలు చేయలేరు.  టీడీపీ ఎంపీలు కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. పార్లమెంట్ లో కానీ ప్రెస్ మీట్ లో కానీ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు.. విభజన హామీలు అమలు చేయండి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ ఆపాలని కానీ ప్రధాని మోదీ ని ఎన్నడూ ప్రశ్నించలేదు. పురంధేశ్వరి చంద్రబాబు బంధువు కావడంతో ఆమెను లక్ష్యంగా చేసుకొన్నారు.


కానీ పురంధేశ్వరి ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాలు.  ఒకవేశ టీడీపీతో సానుకూల వాతావరణం కోసం ఆమెను నియమిస్తే ఈ పాటికే జగన్ పై ఈడీ ఇతర దర్యాప్తు సంస్థలు కేసుల్లో వేగాన్ని పెంచేవి.  అమిత్ షా జగన్ ను భారతదేశంలోనే అత్యంత అవినీతి పరుడు అని వ్యాఖ్యానించారు. మోదీ కూడా స్కామాంధ్రప్రదేశ్ అని ఓ సందర్భంలో విమర్శించారు. కానీ వీటిని వైసీపీ నేతలు తిప్పికొట్టరు. ఆ సాహసం కూడా చేయరు. ఇప్పుడు పురంధేశ్వరి చేసే ప్రతి కార్యక్రమం బీజేపీ అధిష్ఠానానికి తెలియకుండా జరగదు కదా. బీజేపీని నేరుగా విమర్శించలేక విజయసాయి పురంధేశ్వరిపై విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: