ఆ ఐఏఎస్‌ తీరుతో జగన్‌కు దెబ్బ పడుతుందా?

ఏ వ్యవస్థలు అయినా సరే బాగుపడాలి ప్రభుత్వాలు కోరుకుంటాయి. అది ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే. మంచి జరిగితే తమ పార్టీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. తద్వారా మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు దోహదపడుతుంది అన్న ఉద్దేశంలో.. నిర్వీర్యం కావాలని కోరుకోరు.  ఆ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు సమర్థంగా పనిచేయాలని సీఎంలు కోరకుంటారు.

ఉదాహరణకు చంద్రబాబుని తీసుకుంటే ఆయనకు మంచి పేరే ఉంది. ఎందుకు అంటారు అంటే ప్రభుత్వ యంత్రాగంలోని లోపాలను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులను గాడిన పెట్టారు కాబట్టి పని విషయంలో చంద్రబాబుని చండశాసనుడని  అంటుంటారు.  ఆయన గద్దె దిగిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద పీట వేశారు.  దీంతో వరుసగా రెండో సారి గద్దెను ఎక్కారు. అప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగుల జోలికి ఎవరూ వెళ్లడం లేదు. వాళ్ల న్యాయపరమైన కోర్కెలను సాధ్యమైనంత వరకు తీర్చే ప్రయత్నం చేస్తారు తప్ప కయ్యానికి కాలు దువ్వరు.

ఉపాధ్యాయులు, ఐఏఎస్ లు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. కానీ టీచర్లు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించుకుంటూ ఉంటారు.  ఓ వైపు ప్రభుత్వం నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధికి  చర్యలు తీసుకుంటున్నా.. ఉపాధ్యాయులు అందుకు తగ్గట్లుగా బోధన చేయడం లేదని భావించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఆకస్మిక తనిఖీలు చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

వరుసగా పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాలు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ప్రవీణ్ ప్రకాశ్ ని నియంత్రించకపోతే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని హెచ్చరిస్తున్నారు. ఇది వైసీపీ ప్రభుత్వ మెడకు చుట్టుకున్నట్లయింది. ఇప్పుడు  జగన్ ఏం చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: