చంద్రబాబు రైతుల మనోస్థైర్యం దెబ్బ తీస్తున్నారా?
చంద్రబాబు మాటలు చూస్తుంటే ఈ విపత్తు జరగాలి అని చంద్రబాబు కోరుకున్నట్లుందన్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.. నేనున్నప్పుడు ఎక్కువ పరిహారం ఇచ్చాను..ఇప్పుడు తక్కువ ఇస్తున్నారు అని బాబు చెప్పడం, ఆయన పత్రికలు బాకా ఊదడం మొదలు పెట్టాయని విమర్శించారు. ఈ రోజు మేం అనుసరిస్తున్న విధివిధానాలన్నీ మీ హయాంలో పెట్టినవేనని నేను ఆనాడు అసెంబ్లీ సాక్షిగా చెప్పానని.. ఆ తర్వాత జగన్ గారు రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని పెంచి జీవోలు ఇచ్చారని.. ఏదో ఒక విధంగా కష్టకాలంలో రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నాడని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.
రైతులు చంద్రబాబును ఛీ కొట్టారు కాబట్టి చెప్పుకోడానికి ఏమీ లేదన్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అందుకే ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు నష్టపోవాలి...రైతు కష్టాల్లో ఉండాలి..దాని ద్వారా తాను బురదజల్లి లబ్ధిపొందాలనేదే చంద్రబాబు లక్ష్యం తప్ప రైతు సుఖంగా ఉండాలని మాత్రం కాదని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. నిన్నటి వరకూ టీడీపీ నాయకులంతా కరవు అంటూ మొసలి కన్నీరు కార్చారని.. కానీ ఇప్పుడు తుపాను రాగానే వారంతా ముసుగు తన్ని పడుకున్నారని మంత్రి విమర్శించారు. ఇక వారి కోసం పచ్చ పత్రికలు రోజుకో అసత్య కథనాలు రాస్తున్నాయన్న మంత్రి.. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమేనని గుర్తు చేశారు.