గుడ్‌న్యూస్‌: ఆంధ్రాలో మరో రెండు వేల జాబ్స్?

ఆంధ్రాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగుల ఆగ్రహావేశాలను తగ్గించే  పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విషయంలో కీలకమైన అడుగులు వేయబోతుందని తెలుస్తుంది. లేదా ఇది దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేసే పనిలో భాగం కూడా అవ్వచ్చని అంటున్నారు కొంతమంది. ఏది ఏమైతేనే మొత్తానికి గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది.


జాబ్ క్యాలెండర్ అయితే ఇప్పటి వరకు ఏ ఏడాది లోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రసక్తి లేదు. అలాగే పోలీసుల  ఆరున్నర వేల ఉద్యోగాలు కూడా అలాగే ఆగిపోయి ఉన్నాయి. డీఎస్సీ కూడా ఇంకా మొదలవలేదు. అయితే తాజాగా ఏపీ డీఎస్సీ జాబులు ఒకవైపు, ఏపీ గ్రామ సచివాలయాల్లో పశుసంవర్ధక శాఖ సహాయక నియామక ప్రకటన మరొక వైపు కీలకంగా మారాయి. దీనిలో 1896 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించారు.


డైరీ సైన్స్, డైరీ ఇన్ పౌల్ట్రీ, వెటర్నరీ సైన్స్ అనుబంధ సబ్జెక్ట్స్ లో ఒకేషనల్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డీఎస్సీ లేదా ఎమ్మెస్సీ ఉత్తీర్ణులైనటువంటి వారు దీనికి అర్హులు. జూలై 1 2023 నాటికి 18 నుండి 42 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్లు వీటికి అప్లై చేసుకోవచ్చు. బీసీ వర్గాల వాళ్లకైతే 5 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ పిడబ్ల్యుడి వర్గాల వాళ్లకైతే పదేళ్లు గరిష్ట వయోపరిమితి ప్రకటించడం జరిగింది. ఇందులో వ్రాత పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్వహించే ఎంపిక ప్రక్రియలో నియామకం జరుగుతుంది.


వాళ్ళకి 22,460 రూపాయల ప్రారంభ వేతనం నుండి 72,810 రూపాయల వరకు చెల్లిస్తారు. దీని కోసం డిసెంబర్ 10 2023 నాడు ఆన్లైన్ లో దరఖాస్తులు పెడుతున్నారు. ఫీజులు చెల్లించడానికి డిసెంబర్ 11 2023, హాల్ టికెట్ కోసం డిసెంబర్ 27 2023, అలాగే పరీక్ష తేదీ అయితే డిసెంబర్ 31 2023న అని ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: