అమెరికాను తిప్పలు పెడుతున్న ఆ రెండు యుద్దాలు?
ఉక్రెయిన్ కు మద్దతుదారులు తగ్గిపోయారని, యుద్ధానికి ముందు ఆ దేశానికి రక్షణ రంగంతో పాటు ఆర్థికంగా సాయం చేసిన దేశాలు క్రమంగా తమ మాటను వెనక్కి తీసుకుంటున్నాయి. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్లకు సాయానికి స్వస్తి చెబుతామని బాహాటంగానే చెబుతున్న రిపబ్లికన్లు వైఖరి వల్ల అధికార డెమోక్రటిక్ లకు ఇబ్బందిగా మారింది. దీంతో సాయం విషయంలో అమెరికా అనిశ్చితిలో పడింది.
ఇక రెండో విషయానికొస్తే హమాస్ ఇజ్రాయెల్ దాడులు. ఆది నుంచి అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తోంది. దాడులు జరుగుతున్న సమయంలో జోబైడెన్ ఇజ్రాయెల్లో పర్యటించారు కూడా. ఆ దేశానికి ఆర్థిక సాయంతో పాటు యుద్ధ ట్యాంకులు, అణు క్షిపణులు తదితర యుద్ధ సాయం అమెరికా చేస్తోంది.
అయితే రష్యాపై ఉక్రెయిన్ ను, హమాస్ పై ఇజ్రాయెల్ పై దాడులు చేసేందుకు ఉసిగొల్పింది అమెరికానే. ఈ రెండు దేశాల వెనుకే ఉంటూ ఆర్థిక సాయం, యుద్ధ సామగ్రిని అందిస్తూ వస్తోంది. ఆ రెండు దేశాలకు సాయం చేసేందుకు 150 బిలియన్ డాలర్లు అగ్రరాజ్యానికి అవసరం అవుతున్నాయి. ఇజ్రాయెల్ కు 100 బిలియన్ డాలర్లు, ఉక్రెయిన్ కు 50 బిలియన్ డాలర్లు బడ్జెట్ కావాలి. కానీ నిధుల విడుదలకు సెనెట్ అడ్డు పడుతోంది. మరోవైపు ట్రంప్ వర్గం ఈ సహాయాన్ని దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొత్తంగా చూస్తే అమెరికాను నమ్ముకున్నందుకు అటు ఉక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్ ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది.