మోదీ విలువైన మాట.. అంబానీ, అదానీలు వింటారా?

నా వాళ్లు సంపాదించుకున్నారా లేదా.. రేపటి ఎన్నికలకు డబ్బులు సమకూరుతాయా  లేదో.. నా పార్టీ వాళ్లు లాభపడ్డారా లేక నష్టపోయారా ఇలాంటి రాజకీయాలను భారతీయులు సుదీర్ఘకాలం పాటు చూశారు. కానీ ప్రతి అవకాశాన్ని భారత దేశ అభివృద్ధి కోసం ఉపయోగించే తత్వం ప్రధాని మోదీది.  విండ్ సోలార్ పవర్ వైపు ప్రపంచ దేశాల దృష్టిని మరల్చుతున్నారు మన ప్రధాని.


ఇందులో ఆయనకు చేకూరే వ్యక్తిగత ప్రయోజనం ఏమీ లేదు.  కాప్ 20 లాంటి కీలక సదస్సుల్లో ఉపన్యాసాలు ఇస్తూ భారత కీర్తిని ప్రపంచ దేశాలకు ఇమిడింప చేస్తున్నారు. అలాగే చైనా దేశస్తులకు చెక్ పెట్టి భారతీయ చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా సంస్కరణలు తీసుకువచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల కాలంలో డెస్టినేషన్ పెళ్లిళ్లు ట్రెండ్ గా మారాయి. విమానాలు వేసుకొని విదేశాలకు వెళ్లి  ఇక్కడ నుంచి కొన్ని కోట్ల రూపాయలను తీసుకెళ్లి విదేశీ మారక నిల్వలను ఖర్చు పెడుతున్నారు.


దీనిని ఆపాలని మోదీ చూస్తున్నారు. దీనివల్ల మోదీకి గానీ.. కేంద్రానికి గానీ వచ్చే కీర్తి అంటూ ఏమీ ఉండదు. కాకపోతే భారతదేశానికి మేలు జరుగుతుంది.  మన దేశంలో ఆ తరహాలో గ్రాండ్ గా పెళ్లిళ్లు జరిగితే విదేశీయులు కూడా మన దేశానికి వస్తారు.  విదేశాల్లో జరిగే వివాహాల వల్ల దేశానికి పైసా ఆదాయం లేకపోగా ఆయా దేశాలు లాభపడుతున్నాయి.


భారత యువ జంటలకు మోదీ కీలక సూచన చేశారు. ఉత్తరాఖండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని కోరారు. ఈ సంప్రదాయాన్ని దేశంలోని పారిశ్రామిక వేత్తలు ప్రాంభించాలని  సూచించారు. మేకిన్ ఇండియాలనే  వెడ్ ఇన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దెహ్రాదూన్ లోని జరిగిన ఉత్తర్ ఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేవభూమిలో వివాహాలు జరిగితే  రాష్ట్ర స్వరూపమే మారిపోతుందని కొత్త మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఒ జంటను కలిపేది దేవుడే అని నమ్మే మనం కొత్త జీవితాన్ని విదేశాల్లో ఎందుకు ప్రారంభించాలని యువతను ఆలోచనలో పడేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: