కేసీఆర్‌.. బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్ చేస్తారా?

తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఏమీ లేదు. అభ్యర్థులను ప్రకటించే సమయానికి కూడా బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉంది. కానీ అనూహ్యంగా రెండు నెలల్లోనే ఆ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.  చివరకు ఓటమి పాలై ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయింది. దీని వెనుక బోలెడు కారణాలు ఉన్నాయి.  సిట్టింగ్ లను మార్చితే గెలిచే అవకాశాలు ఉండేవి. నిరుద్యోగుల పట్ల కొంత సానకూల ధృక్పథంతో ముందుకు వెళ్లాల్సింది లాంటివి.


అయితే వీటన్నింటిని పక్కన పెడుతూ ఇప్పుడు మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. అదేంటంటే  తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటమి లేదు.  భారత రాష్ట్ర సమితికి విజయం లేదు. సరిగ్గా చూస్తే ప్రస్తుతం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇదే జరిగింది.  టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఆ పార్టీకి గెలుపు ఓటములు ఉన్నాయి.  అంటే ఆ పార్టీ పోటీ చేసిన సీట్లలో ఆశించిన ఫలితాలు రాబట్టింది.  కానీ అధికారంలోకి రాలేకపోయింది.


2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అధికారంలోకి వచ్చింది.  2009లో టీడీపీతో కలిసినా అధికారంలోకి రాలేదు. కానీ 2014లో బొటాబొటీ మోజార్టీతో సొంతంగా పాలన చేపట్టింది. 2018లో అయితే సంపూర్ణ విజయం సాధించింది. అంటే టీఆర్ఎస్ గా ఉన్న సమయంలో ఆ పార్టీకి తిరుగులేదు.


ఎప్పుడు అయితే జాతీయ  పార్టీ అని టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చారో అప్పటి నుంచి ఆ పార్టీకి ఓటములు ఎదురయ్యాయి.  ఇప్పుడు ఏకంగా అధికారానికే దూరం అయింది. తెలంగాణ అనే  పేరులో ఉండే వైబ్రేషన్ బీఆర్ఎస్ లో లేదు.  దేశ వ్యాప్తంగా పార్టీని ఎలాగూ విస్తరించలేదు. కానీ మహా రాష్ట్ర, ఒడిషా, ఏపీ నేతలను చేర్చుకొని ఏదో హడావుడి చేశారు. సెంటిమెంట్ ను బాగా ఫాలో అయ్యే కేసీఆర్ మళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: