పవన్ వర్సెస్ ముద్రగడ.. జగన్‌ కొత్త ప్లాన్?

కాపు రిజర్వేషన్ ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకం కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో ఒక పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మళ్లీ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ మేరకు ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను ఆహ్వానించారు. జనవరి 1న కిర్లంపూడిలో ఉన్న తన స్వగృహానికి రావాలని పిలుపునిచ్చారు. దీంతో కీలక నిర్ణయం తీసుకుంటారనే తెలుస్తోంది.


ముద్రగడ కాపు రిజర్వేష్ ఉద్యమం నడిపడానికి ముందు ఎన్నెన్నో రాజకీయ పదవులు పొందారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అందుకున్నారు. తుని రైలు విధ్వంస ఘటనతో ఉద్యమం మరింత ఎగిసి పడింది. అయితే వందలాదిమై కేసులు నమోదు అయ్యాయి. రాజకీయంగా టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.


గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కాపులు కూడా ఓ కారణం అని చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ టీడీపీతో విభేదించడం, బీజేపీ దూరం పెట్టడం వంటి పరిణామాలతో టీడీపీ తన అధికారాన్ని కోల్పోయింది. దీంతో ఈసారి ఎలాగైన అధికారాన్ని చేజిక్కించుకోవాలని జనసేనతో పొత్తు పెట్టుకొని కాపులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు మొదలు పెట్టారు.  దీనికి కౌంటర్ గా వైసీపీ ముద్రగడ తో సంప్రదింపులు జరుపుతోంది.


పవన్ కు కౌంటర్ గా ముద్రగడను తమ పార్టీలోకి తీసుకుంటే కాపు ఓట్లు చీలవని వైసీపీ అభిప్రాయపడుతోంది. తుని ఘటనతో కాపులు టీడీపీపై కోపంతో ఉన్నారు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం గట్టిగానే ఉంది. దీనిని తగ్గించాలంటే ముద్రగడ ను అక్కడ నుంచి ఎంపీ బరిలో ఉంచాలని వైసీపీ భావిస్తోందంట. ఇదే నిజమైతే ముద్రగడ కాపు ఉద్యమ నాయకుడు నుంచి వైసీపీ నేతగా మారిపోతారు.  దీనివల్ల ఆయనకు నష్టం జరుగుతుందా లేక లాభం జరుగుతుందా అంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: