కేసీఆర్, జగన్‌ మధ్య తేడా అదేనా?

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కొన్ని వందల డిబెట్లు పెట్టాయి ఎల్లో మీడియా చానల్స్.  చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రూ. 1. 30 లక్షల కోట్లు అప్పుల్లో ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అప్పును పదింతలు పెంచాడని ఆరోపిస్తూ ఎన్నో డిబెట్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.


అయితే చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం ఆదాయంలో ఏమీ లేదు. కానీ ఆదాయంలో లేకుంటే అప్పులు తీసుకోకుంటే ఎలా ప్రశ్నించిన ఆర్ కె లాంటి మేధావి.. అదే జగన్ సంక్షేమాలకు అప్పు చేస్తుంటే మాత్రం ఎందుకు అప్పులు చేస్తున్నారు. రాష్ట్రాన్ని మొత్తం సర్వ నాశనం చేస్తున్నారని మండి పడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం. ఇలా మాట్లాడటం ద్వారా సమాజానికి ఏం మేసేజ్ ఇవ్వాలని భావిస్తున్నారు.


తెలంగాణలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేసిన అప్పుల గురించి శ్వేత పత్రం రిలీజ్ చేశారు. అందులో తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్ర అప్పు 72 వేల కోట్ల రూపాయలు అని.. సీఎం కేసీఆర్ ఆ అప్పును మొత్తం 6. 71 లక్షల కోట్లకు చేర్చారని శ్వేత పత్రంలోో పేర్కొన్నారు. అంటే దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ రాష్ట్రం కోసం చేసిన అప్పు దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు.


దీని గురించి ఎల్లో మీడియా చానళ్లు కానీ ఇప్పటి వరకు అయినా అప్పు గురించి ఎక్కడా డిబెట్ పెట్టిన పాపాన పోలేదు. ఎందుకంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ అంటే ఈ మీడియా సంస్థలకు అంత భయం. ఆంధ్రప్రదేశ్ లో అయితే చంద్రబాబు చేసిన అప్పు.. జగన్ చేసిన అప్పు అన్నింటిని కలిపి జగన్ పైనే రుద్దుతూ విపరీత పెడర్థాలు తీస్తూ బదనాం చేయడంలో మాత్రం ముందుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: