ఒక్కసారిగా ఎన్నికల హీట్‌ పెంచేసిన జగన్‌?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు ఇప్పుడు అక్కడ హీట్ పుట్టిస్తున్నాయి. గతంలో ఏ పార్టీ చేయని విధంగా భారీ స్థాయిలో సీట్లను సర్దుబాటు చేస్తున్నారు. ఇవి పార్టీకి లాభం చేకూరిస్తాయా.. లేక జగన్ రిస్క్ చేస్తున్నారా అనే కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఓవైపు అభ్యర్థులను మార్చుతూనే మరోవైపు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయవంతంగా నిర్వహించారు.  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే ఫ్రేంలో కనిపించారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సభ ద్వారా టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల సమర శంఖాన్ని పూరించిందనే చెప్పవచ్చు.


ఇప్పటికే అభ్యర్థులను మార్చుతూ ఎన్నికల్లో కాస్తా దూకుడుగా ఉన్న జగన్ మరోవైపు తన పుట్టిన రోజు సందర్భంగా ట్యాబ్ ల పంపిణీని ఘనంగా ప్రారంభించి ఎన్నికలకు సిద్ధం అని చాటి చెప్పారు. దీంతో రెండు పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇక ఇరు పార్టీలు రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా పథకాల గురించి చెప్పడం ప్రారంభించారు.


ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. నావల్ల మీ కుటుంబానికి మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటేయ్యండి. ఈ పథకాలు తప్పని.. వీటివల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని చెబుతున్న టీడీపీ జనసేన నాయకులు మేం అమలు చేస్తున్న పథకాలకు ఆరు రెట్లు పెంచి ఇస్తామని చెబుతున్నాయి. ఇది ఎలా సాధ్యం అని ప్రజలను ఆలోచనలో పడేశారు. మరోవైపు చంద్రబాబు గతంలో  ఇచ్చిన రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలు నెరవేర్చారా. ఇప్పుడు మాత్రం వాటిని ఎలా నెరవేరుస్తారు. నేను ఇచ్చిన అన్ని హామీలను పక్కాగా మీ ఖాతాకే జమ చేస్తున్నాను అంటూ మాట్లాడారు. ఇది కొత్త చర్చకు దారి తీసింది. ఇక ప్రజలు ఏం తీర్పును ఇస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: