మీడియా: ఇప్పుడు పేపర్ పెట్టడం చాలా సింపుల్?
పేపర్ కాస్ట్ పెరగడమే దీనికి ప్రధాన కారణం అని అంటున్నారు. కొన్ని వార్త పత్రికలు అయితే కాంట్రాక్ట్ విధానంలో ప్రభుత్వాలు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో తమ వార్త పత్రికలు నడుపుతూ ఉండేవారు. క్రమంగా పత్రిక రంగం పరిస్థితి తల్లక్రిందులైంది. ఇప్పుడున్న పత్రికలు ఒక రాజకీయ పార్టీ నుండి డబ్బులు తీసుకుని దానికి కొమ్ము కాసేలా ఉంటున్నాయని చాలామంది మాట. ఇప్పుడు అదే రకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలాంటివన్నీ నడుస్తున్నాయని అంటున్నారు వాళ్లు చాలా మందే ఉన్నారు. ఒక పేపర్ తయారికీ సాధారణంగా 40-50రూపాయలు వరకు ఖర్చు అవుతుందట. కానీ ఒక వార్త పత్రిక మనకి 5-6 రూపాయలలో దొరుకుతుంది.
తాజాగా కొత్త పత్రికలకు ఇప్పటివరకు ఉన్నటువంటి 8లేయర్ల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించుకుంటూ వచ్చింది. ఇప్పటి వరకు ప్రచురణ రంగానికి సంబంధించి బ్రిటిష్ కాలం1867 నాటి చట్టాలే నడుస్తున్నాయి. ఇప్పుడు పత్రికల రిజిస్ట్రేషన్ పద్ధతిని సులభతరం చేసేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సమాచార ప్రసార శాఖ మంత్రి అమరా గోష్ గురువారం లోక సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ బిల్లు 2023ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ఒకే ఒక్క విడత ద్వారా కొత్త పత్రిక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలవుతుందట.