వైసీపీ నేతలకు ఎల్లో మీడియా బంపర్ ఆఫర్?
అయితే ఇలాంటి సందర్భాల్లో మంత్రులకు రాజు పై విద్వేషం కలిగే అవకాశాలే ఎక్కువ. దాంతో వీళ్ళు వెళ్లి పక్క రాజ్యం వాళ్లతో చేతులు కలపడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వైసిపిలో టికెట్లు రాని వాళ్ళు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారని అంటున్నారు. అలానే వీళ్ళతో పార్టీ మారాలనుకునే వాళ్ళు కూడా తోడవుతారు. ఈ సందర్భంలో వీళ్ళందరికీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఆరు మీడియా వర్గాలు సహకరిస్తాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవే ఎల్లో మీడియాగా పేరున్న ఆరు మీడియా హౌసులు.
మొన్నటి వరకు ఈ మీడియా వర్గాలు ఇదే ఎమ్మెల్యేలను దోపిడీదారులంటూ విమర్శించడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కనుక ఈ మీడియా వర్గాలకు సంబంధించిన రిపోర్టర్లకు ఇంటర్వ్యూ ఇస్తామని చెప్తే గనుక కనుక వాళ్లందరూ వీరికి సహాయంగా నిలబెడతారు. జగన్ ఎవరెవరి మాటలో నమ్మి తమకు అన్యాయం చేశాడని అంటే కనుక అది ఒక మోస్తారు న్యూస్ గా మాత్రమే వీళ్ళు ప్రజెంట్ చేయడానికి వీలవుతుంది.
అదే జగన్ దుర్మార్గం చేశాడని, అతని పరిపాలనే బాగుంటే గనక మమ్మల్ని ఎందుకు మార్చవలసి వస్తుందని అంటే కనుక వారిని ఈ మీడియా వర్గాలు తమ మీడియా మాధ్యమంగా హైలైట్ చేసుకుంటూ వస్తారు. వారి ఇంటర్వ్యూలు ఒక హాఫ్ పేజీలో ప్రజెంట్ చేస్తారు. వాళ్లను స్టూడియోలకు పిలిచి మరీ స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా చేస్తారు. దాంతో ఒకటే దెబ్బకు వీరికి 2పనులు జరుగుతాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.