ఆంధ్రా రాజకీయాలపై కొత్త సర్వేలో షాకింగ్ ఫలితాలు?
ఇది నిజం అవుతాయో లేక అంచనాలు తప్పుతాయో పక్కన పెడితే అన్నిరాజకీయ నాయకులతో సహా ప్రజలు వీటిపై ఆసక్తి చూపుతుంటారు. గతంలో ఇండియూ టుడే సీ ఓటరు కలిసి మూడ్ ఆఫ్ దినేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో ఏపీలోని పరిస్థితిపై ఓ అంచనాను వెల్లడించింది. ఇప్పుడు తాజాగా పోల్ స్ర్టాటజిక్ గ్రూపు సర్వే తమ ఫలితాలను వెల్లడించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకే అధికారం వస్తోందనిఈ సర్వే సంస్థ వెల్లడించింది. సీట్ల సంఖ్యను చెప్పలేదు కానీ ఓట్ల శాతాన్ని మాత్రం వెల్లడించింది. గత ఎన్నికల్లో 50.8 శాతం ఓట్లు సాధించి వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. ఈ సారి ఎన్నికల్లో కొద్దిగా ఓట్లు శాతం తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇప్పుడు 48.5శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.
ఈ సారి ఎలాగైనా అధికారం చేపట్టాలని పావులు కదుపుతున్న చంద్రబాబుకి మాత్రం నిరాశే ఎదురవుతుందని వివరించింది. గతంలో ఒంటరిగా పోటీచేసిన టీడీపీకి 39.8శాతం ఓట్లు రాగా ఈ సారి స్వల్పంగా తగ్గి 38.2 శాతం వస్తాయని తెలిపింది. అయితే ఈ రెండు పార్టీలతో పోల్చితే జనసేనకు ఓట్లు పెరిగాయంది. గతంలో ఆ పార్టీకి 5.89శాతం ఓట్లు పోలవగా ఈ సారి 8.2శాతం వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 5.1శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే టీడీపీ 38, జనసేన 8 మొత్తం కలిపితే 46శాతం ఓట్లు, వైసీపీకి 48శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమికి బీజేపీ కి కలిస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.