అంతా ఫ్రీ.. బాబును ఇబ్బంది పెడుతున్న గతం?

ఆంధ్రాలో త్వరలో జరిగే ఎన్నికలు విశ్వసనీయత అనే అంశం చుట్టూ తిరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పదాన్ని పాపులర్ చేసింది దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి. తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో తన ప్రతిష్ఠను పెంచుకోగలిగారు. చంద్రబాబు కు ఆ విశ్వసనీయత లేదని వైఎస్ విమర్శించేవారు.


ప్రస్తుతం జగన్ కూడా హామీల అమలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. సంక్షేమ క్యాలెండర్ అంటూ పథకాల అమలు తేదీలను ముందుగా ప్రకటించి నిధులు విడుదల చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి తన తండ్రిలాగే విశ్వసనీయత అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. తన పాదయాత్రలో నవరత్నాలు అంటూ హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని పక్కాగా అమలు చేస్తారని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేశారు. ఇప్పుడు కూడా ఎన్నికలకు నా వల్ల మీకు లబ్ధి జరిగిందని భావిస్తేనే ఓటు వేయండి అంటూ ముందుకు వెళ్తున్నారు.


అయితే చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ప్రతి నెల రూ.1500 చొప్పున మహిళల ఖాతాల్లోకి జమ చేస్తానని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన చాలా హామీలను నెరవేర్చలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము మాత్రం నవ రత్నాలను పక్కాగా అమలు చేశామని ప్రచారం చేస్తున్నారు.


గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, గ్యాస్ సిలిండర్ ను రాయితీపై అందజేయడం, పండంటి బిడ్డ పథకం పేరుతో పేద గర్భిణీకి రూ.10వేలు అందజేస్తామని చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు గతంలో అమలు చేయలేదు. ఇంకా చాలా హామీలను టీడీపీ అధినేత తుంగలో తొక్కారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలు  ఎవర్ని నమ్ముతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: