రఘురామ ప్లేస్‌ ఆక్రమించేస్తున్న నిమ్మగడ్డ?

నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్ ఆంధ్రప్రదేవ్ ఎన్నికల కమిషనర్‌‌ గా ఉన్న సమయంలో ప్రభుత్వంతో పేచీ పెట్టుకుని మరీ ఫేమస్ అయిన వ్యక్తి. కరోనా సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం భావిస్తే లేదు కచ్చితంగా నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. ఇక్కడ ఓపెన్ సీక్రెట్ ఆయన తెలుగుదేశం అభిమాని అని అందరికీ అర్థమయిపోయింది.


దీంతో తనకున్న పవర్ తో వైసీపీ ప్రభుత్వాన్ని ఢీకొని పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ దాదాపు 80 శాతం వరకు వైసీపీ పంచాయతీ స్థానాలను దక్కించుకుని టీడీపీతో పాటు నిమ్మగడ్డను కంగు తినిపించింది. ఆ సమయంలో నిమ్మగడ్డ అనే వ్యక్తి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ బహిరంగంగానే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.


అయినా కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా ఎన్నికలు పెట్టారు. రెండో దశ ఎన్నికలు కూడా వైసీపీకి అనుకూలంగా తీర్పు రావడంతో చేసేదేమీ లేక మూడో దశ ఎన్నికలు నిర్వహించి టీడీపీకి మేలు చేయాలని భావించినా మాకు మేలు జరిగిందని వైసీపీ నాయకులు చర్చించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల కమిషనర్ గా ఉన్న వ్యక్తి ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.  అయితే టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే వారు ఎల్లో మీడియాలో హిరో అవుతారని లేకపోతే జిరో అనే విషయాన్ని మరో మారు నిమ్మగడ్డ రూపంలో స్పష్టమవుతుంది.


ఎందుకంటే రఘురామ కృష్ణంరాజు వైసీపీలో గెలిచిన ఎంపీ.. కానీ జగన్ తో విబేధాల వల్ల ఆ పార్టీని సీఎం జగన్ ను రోజు విమర్శిస్తూ ఉంటారు. దీంతో ఆయనకు ఎల్లో మీడియాలో ఎక్కడ లేని క్రేజ్ ఉంది. ప్రతి డిబేట్ లో ఆయన ఉండాల్సిందే. ఆయన చెప్పేవన్నీ నిజాలు అయినట్లు చూపించడంలో ఆ టీవీ చానళ్లు సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు రఘురామ బాటలో నిమ్మగడ్డ కూడా చేరిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: