పాపం జగన్‌.. బాబుకు కలసివస్తున్న రాజకీయం?

పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అనే నినాదంతో కమ్యూనిస్టులు ఫైట్ చేస్తారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ వారి శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతారు. అలాంటి కమ్యూనిస్టులు కార్మికుల నుంచి కూడా కొంత సొమ్ము విరాళంగా తీసుకుని పార్టీని నడిపించుకుంటారు. మళ్లీ వారికి ఏ కష్టం వచ్చినా వారి తరఫున పోరాటం చేస్తారు. ప్రభుత్వాలకు కార్మికుల సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేస్తుంటారు.


వ్యక్తిగతంగా వచ్చే సమస్యల పరిష్కరానికి పోరాటం చేయరు.. కానీ సామూహికంగా అందరికీ లాభం చేకూరే వాటిపై నిరసనలు చేసి దాన్ని సాధించేందుకు కృషి చేస్తారు. భారతీయ జనతా పార్టీ తో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ఆశిస్తోంది. కానీ గతంలో చంద్రబాబు బీజేపీపై చేసిన విమర్శల వల్ల విబేధాలను కమలనాథులు మరిచిపోలేకపోతున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో పొత్తుకే టీడీపీ సై అంటోంది.


కానీ కమ్యూనిస్టులు మాత్రం బీజేపీతో పొత్తు కాకుండా తమతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీని కోరుతుంది. తమకు క్షేత్ర స్థాయిలో అనేక మంది కార్మికుల మద్దతు ఉందని వారితో టీడీపీకి లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. దీనితో జగన్ మీద అంగన్ వాడీలకు ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకుని కమ్యూనిస్టులు టీడీపీకి దగ్గర కావాలని చూస్తున్నారు. ఒక వేళ ఈ పోరాటంలో అంగన్ వాడీలకు ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచినా తాము చేసిన పోరాటం వల్లే ప్రభుత్వం దిగి వచ్చిందని చెబుతూ ముందుకు సాగుతుంటారు.


కానీ తమకు తాము మాత్రం స్వయంగా పోటీ చేయడానికి నిరాసక్తత కనబరుస్తున్నారు. ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు మంచి ఓటింగ్ శాతం ఉండేది. కానీ దాన్ని వారు చేజేతులా పాడు చేసుకున్నారు. ఇప్పుడు ఏదో పార్టీకి మద్దతు తెలుపుతూ తమను పట్టించుకోండని ప్రాధేయ పడే పరిస్థితికి తెచ్చుకున్నారు. ఇది సరైన విధానం కాదని రాజకీయ విశ్లేషకులు, కమ్యూనిస్టు పార్టీల తీరును తప్పుబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: