జగన్.. నీటి ప్రాజెక్టులకు ఇంత ద్రోహమా?
దీన్ని పట్టించుకోని వైఎస్ ఆ నిర్మాణాన్ని కొనసాగించి రాయలసీమకు నీళ్లు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం పోతిరెడ్డి పాడు కాల్వలను వెడల్పు చేయడం లేదంటూ అదే ఎల్లో మీడియా గగ్గోలు పెడుతుంది. దీంతో రెండు నాలుకల ధోరణి అనేది కేవలం ఎల్లో మీడియాకే చెందుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహ అక్కర్లేదు అని చూపిస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో మిగిలిపోయిన పెండింగ్ ప్రాజెక్టుల పనులకు కావాల్సిన నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అందులో ముఖ్యంగా సాగునీటి కాలువల నిర్మాణానికి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎల్లో మీడియా విషం కక్కుతోంది. ముఖ్యంగా సరిగా జీతాలు ఇద్దామంటే కూడా నిధులు లేవు. ఇలాంటి సమయంలో కాలువల నిర్మాణానికి ఎలా నిధులు తీసుకొస్తున్నారని ప్రశ్నిస్తుంది. గుత్తెదారుల బాగోగుల కోసం జగన్ ఆసక్తి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పోలవరానికి అనుబంధంగా నిర్నించే ఎత్తిపోతల కాలువకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపిస్తోందని దీని కోసం 191 కోట్లను విడుదల చేసిందన ఆరోపణలు ప్రచారం చేస్తుంది. గజపతి నగరం బ్రాంచ్ కాలువ, మైలావరం కాలువ, వెంకటనగరి పంపింగ్ స్కీం, సిద్దాపురం ఎత్తిపోతలు, గోదావరి కరకట్టలు, మరి కొన్ని కాలువల నిర్మాణానికి నిధులు విడుదల చేయగా దీన్ని ఎల్లో మీడియా తీవ్రంగా విమర్శిస్తోంది.