జగన్‌ను చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలా?
ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే అసంతృప్తితో 2019లో జగన్ కి అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా పోటీలో చంద్రబాబు, జగనే ఉన్నారు. తాజాగా మరోసారి వీరిద్దరే పోటీలో ఉన్నారు. మరి వైసీపీ పాలన ఎలా ఉందంటే బాగున్న వారికి బాగుంది నచ్చని వారికి బాగాలేదు. మరి ఇప్పుడు ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు అనేదే అర్థం కానీ విషయం.
అయితే అనూహ్యంగా ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ అవకాశంలా కనిపిస్తున్నారు. ఏపీలో ఇద్దరి పాలన చూసిన ప్రజలు ఎవరి పై నమ్మకం ఉంటే వారికే ఓటేసి గెలిపిస్తారు. అయితే జగన్ చంద్రబాబుతో పాటు ప్రస్తుత తెలంగాణ పాలనను పోల్చి ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎలా అంటే ప్రస్తుతం ఆరు గ్యారంటీల పథకాల అమలులో భాగంగా ప్రజల నుంచి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది.
దీనికోసం ప్రజలు గ్రామ సభలకు వచ్చి అర్జీలు అందించాలి. అదే ఏపీలో అయితే జగన్ సుపరిపాలన పేరుతో వాలంటరీ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్లే ఇంటికి వచ్చి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయం కానీ అధికారుల జోక్యం కానీ లేదు. తెలంగాణతో పోల్చితే ఇది చాలా సులభతరం. ఏపీలో ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తుంటే తెలంగాణలో క్యూలైన్లో నిల్చొని దరఖాస్తు చేసుకునే పరిస్థితి.