మోదీ, రేవంత్: మతాలపరంగా రిజర్వేషన్లు.. ఉండాలా వద్దా?
1990 నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేస్తోందన్నారు. ముస్లిలందర్నీ ఓబీసీలుగా వర్గీకరించారు. అదే సమయంలో ఓబీసీల డిమాండ్లను తిరస్కరించి.. రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలకు రిజర్వేషన్లను కాంగ్రెస్ కల్పించింది. 2004లో రాజ్యాంగం ద్వారా ఓబీసీ కమ్యూనిటీకి ఇచ్చిన 27శాతం రిజర్వేషన్లను ఉల్లంఘించడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. 2011లో మరోసారి ముస్లిం రిజర్వేషన్లను ప్రతిపాదించి వాటిని అమలు చేశారు. కానీ ఇలా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిచడం అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
ఎందుకంటే తాజాగా అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని బీసీ, ఎస్టీ, ఎస్సీలకు కేటాయిస్తామని చెప్పారు. దీనిని కాంగ్రెస్ కాస్తా మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లు వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలింది. ఇది వైరల్ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. దీంతో మేం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది.
వైఎస్ అమలు చేసిన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా భవిష్యత్తులో క్రిష్టియన్ రిజర్వేషన్లు, హిందూ రిజర్వేషన్లు కావాలని ఆయా మతాల వారు ఆందోళనల చేస్తే.. జనాభా పరంగా వీటిని విడదీస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. మొత్తం మీద దీనిపై అర్థవంతమైన చర్చ మతాల వారీగా రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనేది తేల్చితే భవిష్యత్తు తరాల వారికి మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.