జగన్ ట్రాప్: మూడు రాజధానులు కడతానంటున్న చంద్రబాబు?
తాము గెలిచిన తర్వాత విశాఖ నుంచే పాలన సాగిస్తామని మెనిఫెస్టో విడుదల సందర్భంగా తెలిపారు. ఒక్క ఈ నగరం గురించే కాదు. కర్నూలనును న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పారు. అంటే మొత్తం మూడు రాజధానుల అంశానికే కట్టు బడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రాజధానిని కేవలం శానస రాజధాని వరికే పరిమితం చేయనున్నారు. దీని ప్రకారం వచ్చే ఐదేళ్లు అమరావతిలో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు.
అదే చంద్రబాబు సీఎంగా అయితే అమరావతే రాజధాని అని ప్రకటించేశారు. కానీ షరతులు వర్తిస్తాయి అనే తరహాలో మాట్లాడారు. అదేంటంటే మూడు రాజధానుల అంశం ఏపీ ప్రజల్లోకి వెళ్లింది. విశాఖ, కర్నూలు ప్రాంత ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావించారు. ఇప్పుడు చంద్రబాబు అమరావతే రాజధాని అంటే ఈ ప్రాంతాలతో పాటు జిల్లాల్లో కూడా టీడీపీ కూటమికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
అందుకే తాను కూడా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చడంతో పాటు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాదాపు ఇంచుమించుగా వైసీపీ కూడా ఇవే తరహా అంశాలను ప్రకటించింది. కార్యనిర్వాహణ రాజధానిగా విశాఖను వైసీపీ ప్రకటిస్తే.. ఆర్థిక రాజధానిగా తీర్చి దిద్దుతామని టీడీపీ అంటోంది. మొత్తంగా ఇది జగన్ మ్యానిఫెస్టోని కాపీ కొట్టినట్లు.. రాజధాని అంశాలను కూడా కాపీ కొట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది జనాల్లో నెగిటివ్ వేవ్ ను తీసుకు వెళ్తుందని చెబుతున్నారు.