చంద్రబాబు: ఆ ఛానళ్ల విషయంలో పెద్ద తప్పు చేశారా?
ఇక వైసీపీకి సొంతంగా సాక్షి ఉంది. అలాగే ఎన్టీవీ, టీవీ 9 కూడా ఎంతో కొంత మద్దతుగా ఉంటున్నాయని ప్రచారంలో ఉంది. ఇవి మొదట్లో తటస్థంగా పని చేశాయి అనే పేరు కూడా ఉంది. అయితే వీటిపై టీడీపీ బ్యాన్ విధించింది. సాక్షి ఛానల్ టిబేట్ కి టీడీపీ నాయకులు రారు. ఇప్పుడు ఎన్టీవీ, టీవీ 9 ఛానళ్ల టిబేట్ కి ఊడా వెళ్లవద్దు అని టీడీపీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసిందని ప్రచారం సాగుతోంది.
రాజకీయం కాస్తా ఎక్కడికో వెళ్లి చివరకు మీడియా ఛానళ్ల మధ్య బ్యాన్ కి దారి తీశాయి. మరోవైపు చూస్తే ఎన్టీవీ, టీవీ 9 లకు మంచి ఆదరణ ఉంది. ఇటీవల కాలంలో ఇవి టాప్ టీఆర్పీ రేటింగ్ ను పొందాయి. న్యూట్రల్ పీపుల్ కూడా వీటిని వీక్షిస్తారు. ఇప్పుడు టీడీపీ వీటిపై బ్యాన్ అంటూ తీసుకున్న నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అనే భావన వ్యక్తం అవుతుంది.
ఈ సమయంలో వీరు కాస్తా వైసీపీకి అనుకూలంగా పనిచేయడం ప్రారంభించారు. ఎంత సేపు సొంత డబ్బా కొట్టడం ఆ పార్టీ నాయకులతో పాటు తటస్థులకు ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒక అంశంపై వాద ప్రతివాదనలు జరిగినప్పుడే దాంట్లో మజా ఉంటుంది. ప్రజల్లో మార్పు వస్తుంది. కానీ ప్రస్తుతం ఏపీలో ఆ పరిస్థితి లేదు. ఎవరికీ వారు సొంతంగా డబ్బాలు కొట్టుకోవడమే. కానీ టాప్ టీఆర్పీ రేటింగ్ లో ఉన్న ఛానళ్లను దూరం చేసుకోవడం టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. ఈ విషయంపై చంద్రబాబు ఓ సారి ఆలోచించుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.