ఆరు లైన్లుగా హైదరాబాద్ - విజయవాడ రహదారి?
త్వరగా హైదరాబాద్ - విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారి పనులు చేపట్టాలని గడ్కరీని కోరామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేక సమావేశం పెడతామని చెప్పారు. నూతన జాతీయ రహదారుల కోసం మరో సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ పై చర్చ జరుగుతుంది.... కానీ, ముందుకు కదలడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
రీజనల్ రింగ్ రోడ్ పురోగతి ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. ఉప్పల్ - ఘట్కేసర్ ఫ్లై ఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని నితిన్ గడ్కరీ తమతో చెప్పారని ఆయన వివరించారు. బండి సంజయ్ ను కూడా మర్యాద పూర్వకంగా కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అలాగే మరో మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తానన్నారు.
భూపెంద్ర యాదవ్ తో అటవీ పర్యావరణ అనుమతుల గురించి చర్చిస్తానని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారనికి హాజరవుతానన్నారు. తాను అభిపవృద్ధి పనుల కోసం వచ్చానని.. జాతీయ రహదారుల నిధులు ఎక్కువగా తెలంగాణ కు ఇవ్వాలని కోరానని తెలిపారు. వచ్చే మూడేళ్ళ రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ హైదరాబాద్ 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.