కేసీఆర్, రేవంత్.. జంపింగ్ జపాంగ్.. కోర్టులు ధైర్యం చేయాల్సిందే?
ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తోవలో నడుస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఈ సారి రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇప్పటి వరకు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. దీనిపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కు పెడుతున్నా కాంగ్రెస్ మాత్రం లైట్ తీసుకుంటుంది. అసలు పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది మీరే అంటూ రివర్స్ ఎటాక్ చేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని.. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎమ్మెల్యేలు పదే పదే చెప్పారు. కూల్చేస్తామని కొందరు అంటే.. దానంతట అదే పడిపోతుందని మరికొందరు అన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ముప్పు తప్పించుకునేందుకు సీఎం చేరికలకు గేట్లు ఎత్తారు. అయితే వీటిపై ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
వాస్తవంగా ఫిరాయింపుల విషయంలో కోర్టులు ఏం చేయలేవా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ ఎమ్మెల్యే అనర్హత విషయంలో తుది నిర్ణయం స్పీకర్ దే. ఈ విషయంలో కోర్టులు తలదూర్చవు. కాకపోతే ఫిరాయింపు విషయంపై కోర్టు పలు సందర్భాల్లో రకరకాల తీర్పులు వెలువరించింది. ఓ సారి ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని.. మరోసారి మూడు నెలల్లో తేల్చాలని తమ తీర్పును వెలువరించింది. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు ఈ విషయంలో ఎంటర్ అవుతాయి. ఒక కేసులో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఆయా సందర్భాల బట్టి తమ తీర్పును సుప్రీం వెలువరుస్తుంది. మొత్తం మీద అనర్హత విషయంలో తుది తీర్పు స్పీకరుదే.