జగన్ హీరో.. పవన్ కల్యాణ్ సూపర్ హీరో?
ఏపీ ఎన్నికల్లో ఓడిపోయినా జగన్ హీరో అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా, ఆ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని అది సాధారణ విషయం కాదన్నారు. 40 శాతం మంది ఓటర్లు జగన్ వెంటే ఉన్నారు. వైఎస్ షర్మిళకు అసలు నాయకత్వ లక్షణాలు లేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు జగన్ గెలుస్తారనే సమాచారం తమకు ఉందని.. అయినా ఓటమి పాలవడం ఆశ్చర్యం కలిగించింది అన్నారు.
అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 40 శాతం ఓట్లు సాధించని జగన్ హీరో అయితే అంతకు మించి మెజార్టీ సాధించి 164 సీట్లు పొందిన కూటమి నేతలు ఏం అవుతారని ప్రశ్నిస్తున్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది సరికొత్త రికార్డులు సృష్టించిన పవన్ కల్యాణ్ సూపర్ హీరోనా అని అడుగుతున్నారు. వైసీపీకి మించి ఓటు బ్యాంకు సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుని ఏం అని సంబోధిస్తారు అని కేటీఆర్ ను విమర్శిస్తున్నారు. ఒక్కశాతం ఓటు బ్యాంకు పొందిన షర్మిళతో జగన్ ను పోల్చి ఏం చెప్పదలచుకున్నా అర్థం కావడం లేదని విశ్లేషకులు పేర్కొన్నారు. మొత్తం మీద జగన్ హీరో కామెంట్లతో అడ్డంగా బుక్ అయ్యారు.