పార్లమెంట్ ఫైట్: వైసీపీ పాత్ర ఏంటి... మోడీ వైపా..? రాష్ట్రం వైపా..?

RAMAKRISHNA S.S.
- 22 మంది లోక్‌స‌భ స‌భ్యులున్నా ఐదేళ్ల‌లో వైసీపీ చేసింది జీరో
- పార్ల‌మెంట‌రీ పార్టీ మీటింగే పెట్ట‌ని జ‌గ‌న్‌
- న‌లుగురు ఎంపీల‌తో జ‌గ‌న్ సాధించేది సున్నాయేనా..!
( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
త్వరలోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదన‌లు రెడీ అయ్యాయి. బడ్జెట్ కి సంబంధించిన అంశాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న‌ పార్లమెంటు సమావేశాల్లో ఏపీకి సంబంధించిన ప్రధాన పార్టీ వైసిపి ఏ విధంగా వ్యవహరిస్తుంది? ఆ పార్టీకి నలుగురు లోక్ స‌భ సభ్యులు ఉన్న నేప‌థ్యంలో ఎలాంటి సమస్యలను ప్రస్తావిస్తారు? ఏయే అంశాలను వాళ్ళు ప్రాతిపదిక‌గా తీసుకుంటారు? అనేది కేలకంగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఎన్నికల్లో ఎన్నిక‌ల్లో ఎదురైన ఘోర ప‌రాభ‌వం నుంచి కోలుకున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే పార్లమెంటు సమావేశాలు మాత్రం ఆగ‌వు క‌దా.. ఈ నేప‌థ్యంలో త‌న పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డిపై ఉంది. గడిచిన ఐదు సంవత్సరాల్లో 22 మంది లోక్ స‌భ సభ్యులు ఉన్నప్పటికీ... ఆయన ఏమీ చేయలేకపోయారనే ఒక అపప్ర‌ద‌ను మూట‌ కట్టుకున్నారు. వాస్తవానికి కేంద్రం నుంచి ఏమీ తీసుకురాలేకపోయారు కూడా.

దీనిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు కేవలం నలుగురు ఎంపీలతో ఆయన సాధించేది.. తీసుకొచ్చేది ఏమీ కనిపించకపోయినా.. కనీసం ప్రజల పక్షాన సమస్యలను ఎండగ‌డితే అది కొంత వైసీపీకి రాజకీయంగా మేలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కానీ. పార్లమెంటు సభ్యులతో జగన్ మాట్లాడింది కానీ లేదు. కాబట్టి మన ముందు రోజుల్లో ఆయన ఎలా పార్టీ ఎంపీలతో మాట్లాడతారు? ఏయే సమస్యలను ప్రస్తావిస్తారు? లోక్‌స‌భ, రాజ్యసభల్లో ఏ విధంగా వ్యవహరిస్తారు? అనేది చూడాలి.

అయితే అధికారంలో ఉన్నప్పుడే స్పందించని వైసిపి నాయకులు ఇప్పుడు స్పందిస్తారా అనేది నెటిజ‌న్‌ల నుంచి వినిపిస్తున్న కీలక ప్రశ్న. దీనికి అడ్డుకట్ట వేస్తూ జగన్మోహన్ రెడ్డి తన స‌భ్యుల‌ను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ‌రోవైపు.. గ‌త ఐదేళ్లు ప్ర‌ధాని మోడీ వైపు వైసీపీ ఉంద‌ని.. ఆయ‌న చెప్పిన‌ట్టే న‌డుచుకుంద‌నే కామెంట్లు వినిపించాయి. దీంతో కీల‌క‌మైన పోల‌వ‌రం ముందుకు సాగ‌లేదు. మ‌రి ఇప్పుడు కూడా.. మోడీ కొంగుచాటు బిడ్డ‌గానే జ‌గ‌న్ నిల‌బ‌డి పోతారా?  లేక‌.. ఏపీ కోసం కొంతమేర‌కైనా గ‌ళం విప్పుతారా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: