మైనారిటీ సర్కారే అయినా.. మోడీ తగ్గట్లేదుగా?
ఇదిలా ఉండగా.. ఈ చట్టాలను అమలు అమల్లోకి తెచ్చేందుకు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేసింది. ఎన్నో ప్రయాసలు పడి బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి కోర్టు అడ్డంకులను దాటి జులై 1 నుంచి అమలు చేస్తోంది. బ్రిటీషర్ల నాటి చట్టాల నుంచి విముక్తి కల్పించి.. భారతీయ చట్టాలను అమలు చేయడంలో మోదీ పాత్ర అమోఘం.
అయితే సీట్లు తగ్గాయనో.. లేక సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మోదీ భయపడతారు అనే విశ్లేషణలు ప్రారంభంలో వచ్చాయి. గతంతో పోల్చితే బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గినా మోదీ మాత్రం తాను అనుకున్నది సాధించే తీరుతున్నారు. ఈ విషయం ఇప్పటికే తేటతెల్లమైంది. సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మిత్ర పక్షాలకు ప్రాధాన్యమున్న శాఖలు కేటాయించలేదు. వారు చెప్పిన దానికి తలాడించలేదు. కీలకమైన మంత్రిత్వ శాఖలన్నింటిని మోదీ తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు.
ఇక లోక్ సభ స్పీకర్ పదవిని టీడీపీ, జేడీయూ ఆశిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇండియా కూటమి నేతలు సైతం మీరు అభ్యర్థిని నిలబెడితే మేం మద్దతిస్తాం అని బహిరంగంగా ఆఫర్ ఇచ్చినా.. మోదీ తను అనుకున్న వ్యక్తినే స్పీకర్ గా ఎంపిక చేశారు. కేంద్ర మంత్రి పదవులు సైతం ఒక సహాయ, ఒక పోర్ట్ ఫోలియో లు మిత్ర పక్షాలకు అప్పజెప్పారు. ఎక్కడా కూడా అసమ్మతి రాగం తలెత్తకుండా చూసుకున్నారు. ఈ అంశాలు చూసుకుంటే మోదీ మారతారు.. ఈ సారి అంత ఈసీ కాదు అనే ప్రశ్నలకు చెక్ పడినట్లే కనిపిస్తుంది. ప్రధాని అనుకున్నది చేసి తీరుతారు అనేది పై అంశాలు పరిశీలిస్తే అర్థం అవుతుంది.