విద్యుత్‌లో కొత్త ప్రయోగం.. ఇక భారత్ కష్టాలు తీరినట్టేనా?
థర్మల్, జల, అణు విద్యుత్ తో పాటు చమురుశుద్ధి కేంద్రాలు ప్రధానమైనవి, ప్రత్యేకమైనవి. ప్రస్తుతం అణు విద్యుత్ పెంపుపై పలు రాష్ట్రాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీతో క్లీన్ ఎనర్జీని తయారు చేసేందుకు టేబుల్ టాప్ న్యూక్లియర్ రియాక్టర్ ను హెల్రెన్ సంస్థ ప్రవేశ పెట్టింది. హైదరాబాద్ కి చెందిన స్టార్టప్ సంస్థ దీనిని తయారు చేసింది.
అయితే టేబుల్ టాప్ న్యూక్లియర్ రియాక్టర్ తయారీ కోసం ఎలాంటి రేడియో ధార్మిక పదార్థాలు ఉపయోగించలేదని, ఈ రియాక్టర్ వల్ల ఎలాంటి రేడియో ధార్మిక వ్యర్థాలు బయటకు రావని హైలెన్ర్ సంస్థ సీఈవో సిద్ధార్థ దురై రాజన్ తెలిపారు. కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీకి సంబంధించి ఈ సంస్థ భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కుని సొంతం చేసుకుంది.
ఈ క్లీన్ ఎనర్జీలో పలు రకాల సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అణు విద్యుత్ తయారు చేసే సమయంలో దాని వ్యర్థాలు ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ యురేనియం సమస్యే కడప జిల్లాను చుట్టుముట్టుంది. ఇదే విదేశాల్లోని నార్వే దేశంలో ఈ అణు విద్యుత్ తయారైన తర్వాత వచ్చే వ్యర్థాలను వెయ్యి అడుగులు లోతు గొయ్యి తీసి భూమిలోకి పంపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోయినా భవిష్యత్తు తరాలకు మాత్రం ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మరి మన దగ్గర ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారో చూడాలి.