బంగ్లాదేశ్‌ పతనం.. ఇండియా నేర్చుకోవాల్సింది ఇదే?

frame బంగ్లాదేశ్‌ పతనం.. ఇండియా నేర్చుకోవాల్సింది ఇదే?

షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ఉక్కుమహిళగా పేరుంది. ప్రత్యర్థి పార్టీలను ఎన్నికల్లో పోటీ చేయకుండా తొక్కిపడేశారనే అపవాదు ఉంది. విపక్షాలను అణగదొక్కారనే విమర్శ ఉంది. అయినా ఐదు సార్లు ప్రధాని అయిన చరిత్ర ఆమె సొంతం. దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించారు ఆమె.
అయితే ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్ల అంశం పై చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. దీనికి ఆమె తల వంచక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో తన ప్రధాని పదవికి రాజీనామా చేసి అత్యవసరంగా ఇండియాకు వచ్చేశారు. ఇక సైన్యం దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే బంగ్లాను చూసి మనం కొన్ని విషయాలను నేర్చుకోవాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఒకనాడు పాకిస్థాన్ నుంచి విడిపోయి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ.. సుస్థిరత సాధిస్తూ.. మత కల్లోలాలు లేకుండా బంగ్లాదేశ్ ప్రశాంతంగా ఉంది. మరోవైపు పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్లాడుతూ.. అప్పుల కోసం ప్రపంచ దేశాల వైపు ఆశగా ఎదురుచూస్తుంటే.. తమ నుంచి విడిపోయిన బంగ్లా అద్బుత జీడీపీ సాధిస్తుంటే దీనిని పడగొట్టాలని కొన్ని తీవ్ర వాద సంస్థలు, అసాంఘిక శక్తులు వాడిన అస్త్రం ఉద్యోగ రిజర్వేషన్లు. ఇది తెరపైకి కనిపించే అంశం. కానీ తెరవెనుక వేరు రాజకీయ కారణాలు అనేకం ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

చివరకు పాక్ అనుకున్న విధంగా బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి బంగ్లాలోని పాకిస్థాన్ అనుకూల వాదులు తమ వంతు తోడ్పాటు అందించారు. ఇదే సమయంలో భారత్ లో కూడా పాక్ కు అనుకూలంగా మాట్లాడే వారు.. ఆ దేశంపై భక్తి చూపించే సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి. వీరంతా రేపు భవిష్యత్తులో బంగ్లాలో మాదిరిగా హింసను ప్రేరేపిస్తారు. ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి భారత్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చూసే వారికి సహకరిస్తారు. దేశ ద్రోహానికి పాల్పడతారు. బెంగాల్, పంజాబ్, మణిపుర్ లో ప్రస్తుతం జరుగుతుంది అదే. వారి సంతతిని పెంచుకొని దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: